శోభన్ బాబు బయోపిక్... హీరో అతనే...?

Sahithya
టాలీవుడ్ లో బయోపిక్ లకు సంబంధించిన వార్తలు ఎప్పటి నుంచో ఎవరో ఒకరి మీద వస్తూనే ఉంటాయి. బయోపిక్ లో విషయంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి కరం గా ఉన్నా సరే హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. కొంతమంది టాలీవుడ్ ప్రముఖుల కు సంబంధించిన జీవితాలలో తెర మీద చూపించే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నారు కానీ చాలా మంది హీరోలు ఆ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హీరో శోభన్ బాబు బయోపిక్ కి సంబంధించిన వార్తలు ఎప్పటి నుంచో వచ్చాయి.
శోభన్ బాబు బయోపిక్ చేయడానికి మురళీమోహన్ ఆసక్తికరంగా ఉన్నారని నిర్మాతగా ఆయన వ్యవహరించే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం అయితే ఈ బయోపిక్ విషయంలో శోభన్ బాబు కుటుంబం అంతగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం కూడా ఉంది. ఈ విషయంలో అత్యంత పట్టుదలగా ఉన్న మురళీ మోహన్ ఇటీవల శోభన్ బాబు కుటుంబాన్ని కూడా కలిశారని వాళ్లు కూడా దాదాపుగా అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. శోభన్ బాబు పాత్రను ఎవరు పోషిస్తారు ఏమిటన్న దానిపై స్పష్టత లేకపోయినా ఆ పాత్రలో శర్వానంద్ పోషించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
శర్వానంద్ ఆ పాత్రకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అయితే కథ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని శోభన్ బాబు కుటుంబం దానికి సంబంధించి పట్టుబట్టడంతో మురళీమోహన్ కథను చేంజ్ చేస్తున్నారని సమాచారం. ఈ కథ విషయంలో పరుచూరి బ్రదర్స్ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఈ కథను దాదాపుగా పూర్తి చేసింది కూడా పరుచూరి బ్రదర్స్ అని అంటున్నారు. శోభన్ బాబు జీవితం గురించి ఎక్కువగా పరుచూరి బ్రదర్స్ కి తెలియడంతో నే మురళీమోహన్ వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగించారని కూడా టాలీవుడ్ వర్గాల మాట. మరి ఇది ఎంతవరకు ముందుకెళుతోంది ఏంటి అనేది త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: