హీరో తనీష్ మళ్ళీ మెరుస్తాడా?

VAMSI
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోలుగా మారి రాణించిన వారిలో తనీష్ కూడా ఒకరు. నిన్నే ప్రేమిస్తా, ప్రేమంటే ఇదేరా, దేవుళ్ళు, మన్మధుడు వంటి చిత్రాల్లో బాలనటుడిగా అలరించాడు. పంచ్ లు పర్ఫెక్ట్ గా వేసి యాక్షన్ బాగా దట్టించి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఎన్నో సినిమాలలో బాలనటుడిగా ఆకట్టుకున్న తనీష్ "నచ్చావులే" చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని వరుస అవకాశాలు సొంతం చేసుకున్నాడు. ఏం పిల్లో ఏం పిల్లడో, మౌనరాగం, కోడిపుంజు, చాణక్యుడు, మేం వయసుకు వచ్చాం, రైడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోయినా బాలనటుడిగా కెరియర్ మొదలు పెట్టి హీరోగా మారి ఇలా వరుస అవకాశాలు అందుకోవడం అంటే చిన్న విషయమేమీ కాదు. అతడిలో అంత టాలెంట్ ఉంటే తప్ప డైరెక్టర్లు ఓ పట్టాన అవకాశం ఇవ్వరు అలాగే నిర్మాతలు ముందుకు రారు.
అలాంటి గుర్తింపు ను దక్కించుకున్నాడు హీరో తనీష్. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా ఈ హీరో ఇండస్ట్రీలో కనుమరుగై పోవడం తన అభిమానులను ఎంతగానో బాధించింది. సినిమాలు చేస్తున్నా వరుస ఫ్లాపులు చుట్టుముట్టడంతో ఈ హీరోకి అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక అక్కడ తనీష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీప్తి సునైన మనోడు దాదాపు డీప్ లవ్ లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో ది బెస్ట్ పులిహోర రాజా అంటూ అప్పట్లో నెటిజన్లు ట్రోల్స్ కూడా చేశాడు. బిగ్ బాస్ తర్వాత అవకాశాలు వస్తాయి మళ్లీ బిజీ హీరోగా మారి పోతాడు అని అందరూ అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు. ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు దక్కలేదు.
తాజాగా ఈ హీరో నటించిన "మరో ప్రస్థానం" మూవీ రిలీజ్ కాగా అది మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఈ మధ్య డ్రగ్స్ కేసులో తనీష్ చిక్కుకున్నాడు అంటూ..అతడికి కోర్టు నుండి నోటీసులు వచ్చాయని...సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై స్పందించిన తనీష్  తనకు ఆ డ్రగ్స్ కేస్ కు ఎటువంటి సంబంధం లేదని...తనకు కోర్టు నుండి నోటీసులు వచ్చిన మాట నిజమే. కానీ అసలు విషయం ఏంటంటే బెంగళూర్ లో ఒక ప్రొడ్యూసర్ పైన కేసు నమోదు అయ్యింది...దాంతో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆధారాల కోసం  అతని  కాంటాక్ట్ అయిన వారికందరికీ నోటీసులు పంపినట్లు తెలిసింది. మళ్ళీ మునుపటిలాగే తనీష్ ఇండస్ట్రీలో హీరోగా అలరిస్తాడా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: