మాస్ ఆడియన్స్‌నే కాదు వారినీ అలరించిన బాలయ్య..!

Suma Kallamadi
నందమూరి నట సింహం బాలకృష్ణ చాలా ఫ్యాక్షన్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అయితే ఆయన నటించిన యాక్షన్ ఫిలిమ్స్ చాలా వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం అలరించాయి. ముఖ్యంగా 2001వ సంవత్సరంలో వచ్చిన నరసింహనాయుడు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రీతి జింగానియా, సిమ్రాన్, ఆషా సైని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు తదితరులు కూడా ఈ సినిమాలో నటించి కామెడీ పండించారు. గుండాలు, రౌడీల నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునే నరసింహ నాయుడిగా బాలకృష్ణ అద్భుత నటనా చాతుర్యాన్ని కనబరిచారు. అంతేకాదు ఆయన క్లాసికల్ డ్యాన్సర్ గా కనిపించి అభిమానులను ఫిదా చేశారు. ఈ సినిమాకి గాను అతనికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు కూడా లభించింది.


ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో 16 సుమోలలో గుండాలు ట్రైన్ వెంట పడుతుంటారు. బాలకృష్ణను చంపేందుకు ట్రైన్ ను చేంజ్ చేస్తుంటారు. ఈ సన్నివేశం సినిమా మొత్తం లో హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా లోని ఫ్లాష్ బ్యాక్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా అలరిస్తుంది. నరసింహనాయుడికి ముగ్గురు అన్నయ్యలు ఉంటారు. వీరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు చాలా భావోద్వేగంగా ఉంటాయి.



ఈ చిత్రానికి చిన్నికృష్ణ కథ అందించగా.. బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని చాలా ఫైట్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటే దానికి కారణం బి.గోపాలే అని చెప్పవచ్చు. ఆయన సెంటిమెంట్ సన్నివేశాలు కూడా చాలా చక్కగా రూపొందించి మూవీకి అభిమానులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇక పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగులను బాలకృష్ణ పవర్‌ఫుల్ గా చెప్పి కేక పుట్టించారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. పాపా లక్స్ పాపా లంచికొస్తావా, చిలకపచ్చ కోక, నిన్నా కుట్టేసినది మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ను సైతం మెప్పించాయి. దేవి పుత్రుడు, మృగరాజు సినిమాలు విడుదలైన సమయంలోనే నరసింహనాయుడు చిత్రం కూడా విడుదలైంది. అయితే ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ బాలయ్య సినిమా మాత్రం రికార్డులు సృష్టించింది. 20 ఏళ్ల క్రితం 30 కోట్లు కలెక్ట్ చేసిన నరసింహనాయుడు చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. 105 సినిమా థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: