తమన్నా అందాల బండి...స్వింగ్ జరా స్వింగ్ జరా..!

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జై లవకుశ' .ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ 'స్వింగ్ జరా స్వింగ్ జరా' కు కూడా ప్రజల నుండి అంతే ఆదరణ దక్కింది. తమన్నా కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో ఐటెం పాటలో కనిపించింది మెప్పించింది.

 కానీ 'జై లవకుశ' సినిమాలో చేసిన 'నేనో గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి' అనే పాట మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ పాటలో తమన్నా నటనకు అందచందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ లో తమన్నా ఎన్టీఆర్ కు ఏ మాత్రం తగ్గకుండా సరి సమానంగా స్టెప్పులు వేసి  ప్రేక్షకులను ఉర్రూతలూగించింది .ఈ పాట ఇంతలా జనాలని ఆకట్టుకోవడానికి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అందులో మన మొదటిగా మాట్లాడుకోవాల్సిన దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి  రామజోగయ్యశాస్త్రి రాసిన లిరిక్స్ మరింత పాటను హైలెట్ చేశాయి. వీటితో పాటు  ఈ పాట విజయవంతం కావడానికి కారణమైన మరొక వ్యక్తి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఈ పాట కోసం కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. ఇప్పటికి కూడా 'నేనో గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి' పాట యూట్యూబ్ లో మిలియన్ కొద్ది వ్యూస్ ని సాధిస్తూ ముందుకు దూసుకుపోవడం చూస్తూనే మీకు అర్ధం అయి ఉంటది ఈ పాట ఎంత విజయవంతం అయిందో .ఈ ఐటమ్ సాంగ్ తర్వాత తమన్నా పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో కూడా ఐటెం పాటలో కనిపించి జనాలను మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: