పాన్ ఇండియా స్టార్ గా మారనున్న అల్లు అర్హ..?

Suma Kallamadi
అల్లు రామలింగయ్య తర్వాత ఆయన కుమారుడు అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా అరంగేట్రం చేశారు. అయితే ఆయన ఇద్దరు కుమారులు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా తెరంగేట్రం చేశారు. బన్నీ అల్లు వారసత్వం నిలబెడుతున్న మూడవ తరానికి చెందిన వారు. ఆయన పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం కానుంది. దీంతో అల్లు వారి 4వ జనరేషన్ కూడా సినిమా ఇండస్ట్రీలో కాలు మోపడానికి సిద్ధం అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే బన్నీ, స్నేహ రెడ్డి గారాలపట్టి అర్హ సమంతా ప్రస్తుతం నటిస్తున్న శాకుంతలం సినిమాలో భారత అనే ఒక యువరాజు పాత్ర పోషిస్తోంది. శకుంతలా దేవి పాత్ర పోషిస్తున్న సమంతాకు కొడుకుగా అర్హ కనిపించనుందని సమాచారం.
గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. అయితే ఈ రోజు అర్హ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యిందని సమాచారం. ఈ చిన్నారికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. అల్లు కుటుంబ సభ్యులు అర్హ ని సినిమాల్లో నటింపజేయాలని తెగ తపన పడుతున్నారట. విశేషమేంటంటే.. అల్లు అర్జున్ కొడుకు అయాన్ కంటే ముందుగానే అర్హ వెండి తెరపై మెరవనుంది.

ఈ విషయాన్ని తండ్రి అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "నాల్గవ తరం అల్లుఅర్హ శకుంతలం చిత్రంతో తెరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించడానికి అల్లు కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. నా కుమార్తెకు ఈ అద్భుతమైన చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు గాను గుణశేఖర్, నీలీమా గుణలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను." అని పేర్కొన్నారు.
భారీ బడ్జెట్ తో పొందుతున్న ఈ పౌరాణిక ప్రేమ డ్రామాని నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, మల్హోత్రా శివం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు శ్రీమణి, చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించనున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: