ఆ స్క్రీన్‌ లోని మ్యాజికే వేరు అంటున్న టాలీవుడ్ బ్యూటీ...?

Suma Kallamadi
కరోనా వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.సినిమా హాల్స్ అన్నీ మూతపడ్డాయి. ఎక్కడ షూటింగ్స్ అక్కడ ఆగిపోయాయి.చాలామంది కళాకారులూ రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ బాగా డెవలప్ అయింది. ఓటిటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు చూసే విధానం వచ్చేసింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌ స్పేస్‌ లో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ మంచి స్థాయికి వచ్చేశాయి.ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేసే రోజులు వచ్చేసాయి అంటుంది మన టాలీవుడ్ ముద్దు గుమ్మ రకుల్ ప్రీతి సింగ్.
ఈ క్రమంలోనే ఈ ఓటీటీల వలన అటు హీరో హీరోయిన్స్ తోపాటు,  నటీ నటులకు, దర్శకులకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని  చెబుతుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అంతేకాకుండా ఇంకా రకుల్‌ ఏమ్మన్నారు అంటే ‘కరోనా వైరస్ కారణంగా థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన ఆపివేయడంతో  ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో లేకుండా పోయింది. ఈ కారణం చేత ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ లోని కంటెంట్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ లో రిలీజ్ అయ్యే సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న  ప్రేక్షకులు ఆ సినిమాలు చూసి మనల్ని  ప్రశంసిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది.
అయితే పెద్ద స్క్రీన్ పై  సినిమాలను చూసి ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేసేవారో, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా సినిమాలను చూసి అంతే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మనల్ని ఎంటర్‌ టైన్‌మెంట్‌ చేసే  ప్లాట్‌ ఫామ్స్‌ ఎన్ని వచ్చినా గాని సినిమా హాల్లో పెద్ద  స్క్రీన్‌ పై సినిమా చూస్తే వచ్చే మ్యాజిక్‌ వేరు కదా "అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీతి సింగ్. ఏది ఏమయినా రకుల్ చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉంది కదా. ఇంట్లో కూర్చుని చిన్న తెరపై సినిమా చూసే దానిలో ఉన్న థ్రిల్ కంటె ఫ్యామిలీతో బయటకు వెళ్లి పెద్ద స్క్రీన్ పై సినిమా చూస్తే వచ్చే థ్రిల్ ఎక్కువగా ఉంటుంది కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: