అబ్బో ... తమిళ స్టార్స్ వాటిపై గట్టిగానే గురిపెట్టినట్లున్నారుగా .... ??

GVK Writings
ప్రస్తుతం తెలుగు సహా పలు ఇతర సౌత్ భాషల సినిమా పరిశ్రమలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాల గొప్ప విజయాల తరువాత మన సౌత్ లో ఈ స్థాయి సినిమాల రాక మొదలైంది. ఆ తరువాత అక్కడక్కడా పలు భాషల్లో పాన్ ఇండియా మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ఈ తరహా సినిమాల ద్వారా హీరోల మార్కెట్ స్థాయి, పాపులారిటీ పెరగడంతో పాటు ఎక్కువమంది ఆడియన్స్ కి సినిమా రీచబులిటీ పెరుగుతుంది.
దానితో దాదాపుగా చాలా మంది హీరోలు ఈ తరహా మూవీస్ పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు తమిళ్ లో ఇటీవల మాస్టర్ తో మంచి హిట్ కొట్టిన ఇలయతలపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సినిమాని తెలుగు సహా పలు ఇతర భాషల్లో భారీగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అలానే దీని తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న భారీ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో తీసేలా దృష్టి సారించారట విజయ్. తద్వారా తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా తన మార్కెట్ పరిధి పెంచుకునేలా ఆలోచనలు చేస్తున్నారట విజయ్.
అలానే ధనుష్ త్వరలో టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. నిన్న ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది, ఏషియన్ సినిమాస్ సంస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఇక వీరితో పాటు కమల్, రజినీ, అలానే సూర్య కూడా ఈ తరహా సినిమాలు చేసేలా తమ వద్దకు వస్తున్న కథకులు, దర్శకులకు సూచనలు చేస్తున్నారట. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే మన హీరోల మాదిరి తమిళ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలపై గట్టిగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ..... !!    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: