"సాంబ" మూవీ ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే ?

VAMSI
తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే ప్రేక్షకులు పోటీ పడి మరీ చూసేవారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలెన్నో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందాయి. అయితే నందమూరి వంశం నుంచి వచ్చే ఫ్యాక్షన్ సినిమాలంటే ఇక యాక్షన్ డోసు మాములుగా ఉండదు. రాయలసీమ యాసలో వచ్చే డైలాగులు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయి. నందమూరి వంశంలో బాలకృష్ణతో ఫ్యాక్షన్ రంగం మొదలయింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యాక్షన్ సినిమాలను చేశాడు. ఈ నేపథ్యంలో 2004 లో ఫ్యాక్షన్ నేపథ్యంలో సాంబ మూవీని చేశాడు. అప్పటికే ఆది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ మరియు వి వి వినాయకు కాంబినేషన్ మళ్ళీ మరో హిట్ పై కన్నేశారు. కానీ ఈ సారి మాత్రం కాలం కన్నెర్ర చేసింది. తద్వారా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. అయితే ఈ సినిమా పరాజయం పాలవ్వడానికి కారణాలను చూస్తే, మొదటగా ఈ సినిమా లైన్ బాగుంది.

 * "విద్య యొక్క విలువ అది అందరికీ దక్కాలన్న ఆశయం" అనే పాయింట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్. సినిమాలో ఎక్కువ భాగం హింసకు సంబంధించిన సీన్ లను జోడించడంతో ఒక్క మాస్ ఆడియన్స్ తప్పించి, పిల్లలు కానీ లేదా ఫ్యామిలీ ప్రేక్షకులు కానీ ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
* ఒక సినిమా విజయంలో ఎంటెర్టైన్మెంట్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో కామెడీ కొంతవరకు పర్వాలేదు కానీ, పాటలు మాత్రం ప్రేక్షకులను రంజింపచేసే స్థాయిలో లేదన్నది వాస్తవం. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మణిశర్మ బాణీలు అంతగా ఆకట్టుకోలేదు.
* ఈ సినిమాలో హీరోయిన్ లు ఇద్దరు ఉన్నప్పటికీ, వారికి స్క్రీన్ ప్రెజన్స్ తక్కువగా ఉండడంతో ప్రేక్షకులు వారికి కనెక్ట్ కాలేకపోయారు. భూమిక కొద్ది సేపే ఉన్నా, జెనీలియా కన్నా పర్వాలేదనిపించింది. జెనీలియా మాత్రం పాటల్లోనే బబ్లీ గా ఉంది.
* అన్నిటికన్నా  మించి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "ఆది" ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. "ఆది" ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్ళాడు. "ఆది" లాగా ఈ సినిమా వారికి రుచించకపోయి ఉండవచ్చు.  ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచడంలో పై విషయాలు ప్రధాన కారణంగా నిలిచాయి.

 ఇందులో పాజిటివ్ విషయాల గురించి చూస్తే,
సాంబశివ నాయుడు పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల కంట నీరు తెప్పించింది. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రభుదేవా, లారెన్స్ మరియు రాజశేఖర్ కోరియోగ్రఫీ చేసిన విధానం ఆకట్టుకుంది. ఇక ఫ్యాక్షన్ సినిమాలలో డైలాగులకు ప్రత్యేక స్థానం. కోన వెంకట్ తన డైలాగులతో ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకోగలిగాడు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ స్నేహితుడు మరియు రాజకీయ నాయకుడు కొడాలి నాని నిర్మించడం విశేషం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: