ఎన్టీఆర్-వెంకటేష్ కాంబో జస్ట్ మిస్..?

Suma Kallamadi
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ తో కలసి ఒక చారిత్రక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా భారీ బడ్జెట్ తో చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు. శాతకర్ణి కుమారుడు పులోమావి పాత్రలో వెంకటేష్ ని తీసుకోవాలని ఆయన భావించారు. అయితే ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సినిమా అనగానే వెంకటేష్ వెంటనే ఓకే చెప్పేసారు. మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా సిద్ధం చేయించారు. వెంకటేష్ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం కోసం శాతకర్ణి కుమారుడి పాత్రకు తన పాత్రతో సరిసమానంగా ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ రాయించారు.
అయితే సరిగ్గా సినిమా ప్రారంభం కానున్న సమయంలోనే రామారావు రాజకీయాలతో చాలా బిజీ అయిపోయారు. కొంత సమయం తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో శాతకర్ణి సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. ఒకవేళ వెంకటేష్, ఎన్టీఆర్ కలిసి ప్రతిష్టాత్మకంగా శాతకర్ణి సినిమా చేసినట్లయితే.. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదేమో. కాని దురదృష్టవశాత్తు వెంకటేష్.. ఎన్టీఆర్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు.
ఇక ఇదే సినిమా స్టోరీతో బాలకృష్ణతో కలిసి దర్శకుడు క్రిష్ "గౌతమీపుత్ర శాతకర్ణి" సినిమా రూపొందించారు. ఈ సినిమాలో శాతకర్ణి కుమారుడు పులోమావి పాత్ర మొత్తం తొలగించేశారు. ఐతే భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా హిట్ అయ్యింది. అయితే వేరే హీరోతో ఇదే కథను తెరకెక్కించినట్లయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేదని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. సమయం లేదు మిత్రమా శరణమా రణమా వంటి డైలాగులు బాగున్నాయి కానీ బాలకృష్ణ ఇంకాస్త గాంభీర్యంగా చెప్పినట్లయితే బాగుండేదని అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏది ఏమైనా బాలకృష్ణ ఒక చారిత్రక పాత్రలో చక్కగా ఒదిగి పోయి ఆశ్చర్యపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: