పాయింట్ ఆయనిదే .... కానీ దాని జాయింట్లన్నీ కూర్చేది జక్కన్నే ..... ??

GVK Writings
టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కి తెలుగు తో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి భారీ విజయాలు సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు సినిమా రేంజ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లాయి. ఆ విధంగా తన అద్భుతమైన క్రియేటివిటీ తో రాజమౌళి తెరకెక్కించిన ఆ రెండు సినిమాలు భారీ కలెక్షన్స్ అందుకుని భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్నిలిఖించాయి.
తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన రాజమౌళి ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆపై మరొకసారి ఆయన ఎన్టీఆర్ తోనే తీసిన సినిమా సింహాద్రి. విడుదల తరువాత ఆ మూవీ సెన్సేషనల్ సక్సెస్ కొట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ వాటి ద్వారా విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ కొనసాగుతున్న రాజమౌళి, ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రౌద్రం రణం రుధిరం అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ లో ముందుకు రానుంది. అసలు విషయం ఏమిటంటే దాదాపుగా రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, ఒకసారి తండ్రితో కలిసి ఏదైనా మూవీ స్టోరీ ఓకే చేసిన తరువాత, దాని యొక్క స్క్రీన్ ప్లే ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా రాసుకుంటారని, అక్కడి నుండి సినిమా చిత్రీకరణ, సహా మిగతా కార్యక్రమాలు అన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటారట. ఇక ఏదైనా సీన్ సరిగ్గా రాకపోతే మాత్రం ఎన్ని టేక్ లయినా తీసుకునే రాజమౌళి అనుకున్న అవుట్ ఫుట్ బయటకు వచ్చే వరకు ఏ మాత్రం కాంప్రమైజ్ కారట. అందుకే రాజమౌళి తీసే సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అవుతుంటాయని అంటారు ఆయన సన్నిహితులు. కాగా ఆ విధంగా స్టోరీ యొక్క పాయింట్ తండ్రిదే అయినప్పటికీ దాని జాయింట్లన్నీ కూడా సమకూర్చే ప్రక్రియ మొత్తం రాజమౌళేదే నని తెలుస్తోంది .... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: