బాక్సాఫీస్ ని రఫ్ఫాడించిన నిన్నటితరం హీరోలు

Mamatha Reddy
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు , శోభన్ బాబు ఒక తరంలో మంచి మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు టాలీవుడ్ లో తమ సత్తా చాటారు. ఈ సీనియర్ హీరోలు ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ వరుస సినిమాలు చేస్తూ వారికి సవాల్ విసురుతున్నారు. తెలుగు సినిమా అంటేనే హీరోయిన్ గ్లామర్, హీరో హీరోయిజం కలగలిపి ఉండే సినిమా.. అయితే కథానాయిక లేకున్నా  కథా బలం ఉంటే సినిమా సక్సెస్ అవుతుందన్న విషయాన్ని అప్పుడప్పుడు మన హీరోలు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు.

అలా చిరంజీవి తాను నటించబోయే లూసిఫర్ రీమేక్ లో హీరోయిన్ లేకుండానే నటిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో చిరంజీవి మేజర్, బంధాలు అనుబంధాలు, అనే సినిమాలో హీరోయిన్ లేకుండా సింగిల్ గా మెప్పించారు. బాలకృష్ణ కూడా కథానాయిక లేకుండా ఒంటరిగానే నటించి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు. వేములవాడ భీమకవి  అనే చిత్రంలో ఆయన హీరోయిన్ లేకుండానే నటించి హిట్ కొట్టారు. అక్కినేని నాగార్జున కూడా షిరిడి సాయి, గగనం వంటి సినిమాల్లో హీరోయిన్ లేకుండా నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, సూపర్ హిట్ కూడా కొట్టారు..

విక్టరీ వెంకటేష్ కమల్ హాసన్ నటించిన ఈనాడు అనే సినిమాలో హీరోయిన్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించడం విశేషం. రజినీకాంత్ పెదరాయుడు సహా కొన్ని సినిమాల్లో సింగిల్ గా నటించి బాక్సాఫీస్ ని షేక్ చేయగా, మోహన్ బాబు కూడా హీరోగా ప్రమోషన్ పొందిన కొన్ని సినిమాల్లో హీరోయిన్ లేకుండా నటించి శభాష్ అనిపించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ చదరంగం అనే సినిమాలో కథానాయిక లేకుండా నటించడం విశేషం. కృష్ణంరాజు హీరో గా చేసినా టూ టౌన్ రౌడీ,  గ్యాంగ్ మాస్టర్ వంటి సినిమాల్లో హీరోయిన్ లేదు. శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరావు వంటి ఇతర హీరోలు కూడా హీరోయిన్ లేకుండా కొన్ని సినిమా తీసి హిట్ కొట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: