టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

Divya

తెలుగు సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్ లే కాకుండా,  డైరెక్టర్ లు సైతం ఒక్కో సినిమాకి ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా..? తెలియకపోతే ఇక్కడ ఒక సారి చూద్దాం.
1). ఎస్ ఎస్ రాజమౌళి:
బాహుబలి సినిమా వల్ల భారీ క్రేజ్ సంపాదించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి. ఏ సినిమా చేసిన సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతేకాకుండా బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసే సత్తా ఉన్న దర్శక ధీరుడు  రాజమౌళి పేరుపొందాడు. ఈయన ఒక్కో సినిమాకు రూ.30 కోట్ల పారితోషికం తీసుకుంటాడు.
2). సుకుమార్:
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన  సినిమాలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ని చూపిస్తాయి. ఈయన ఒక సినిమాకి రూ.20 కోట్లతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట.
3). త్రివిక్రమ్:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ కూడా ఒకడు. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడతారు. ఈయన సినిమాలను మాత్రమే కాకుండా యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఈయన ఒక సినిమాకి రూ.20 కోట్ల పారితోషికంగా తీసుకుంటాడు.
4). కొరటాల శివ:
మహేష్ బాబు తో రెండు సినిమాలను బ్లాక్ బాస్టర్ అందించిన ఈయన. ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల పైనే తీసుకుంటాడట.
5). బోయపాటి శ్రీను:
వైలెన్స్ కి మారుపేరు ఎవరంటే బోయపాటి అని చెప్పవచ్చు. ఈయన ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల పైనే తీసుకుంటాడట.
6). పూరి జగన్నాథ్:
పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈయన జనాల్లో కూడా ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నాడు. ఈయన ఒక సినిమాకి ఏడు నుంచి పది కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడట.
7). అనిల్:
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తో అమాంతం రేటు పెంచేశాడు అని టాక్. ఈయన మన ఒక సినిమాకు రూ.8 కోట్ల పైనే తీసుకుంటాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: