ఫస్ట్ లుక్: ఓ కుర్రాడి లైఫ్ జర్నీనే 'ప్రయాణికుడు'...!

VAMSI
ఒకప్పుడు కొత్త డైరెక్టర్ల సినిమాలంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ముందుగా ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవ్వాలంటే ఆ చిత్ర దర్శకుడికి మినిమం ఓ హిట్ పడుండాలి లేదా హీరో అయినా బాగా పాపులర్ అయి ఉండాలి. లేదంటే అవకాశాలు దొరకడం చాలా కష్టము. ఇలాంటివి అప్పట్లో చాలానే చూశాం. కానీ ఇప్పుడు సినిమాని చూసే కోణం మారింది. ఓ సినిమా రిలీజ్ కాబోతుంది అంటే...డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు అనే క్యూరియాసిటీ ఉండనే ఉంటుంది. కానీ హీరో, దర్శకుడు అన్న మాట పక్కన పెడితే ముఖ్యంగా సినిమా స్టోరీ బాగుందా అని చూస్తున్నారు. కథలో బలమైన పట్టు ఉంటే ..ఆటోమేటిక్ గా అందరూ ఆకర్షితులవుతున్నారు. ఒకప్పట్లో కొత్త డైరెక్టర్ ల కి అగ్ర హీరోలు చాన్స్ ఇవ్వడం అంటే గగనం అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ దర్శకుడికి టాలెంట్ ఉంటే చాలు టాప్ అండ్ సీనియర్ స్టార్ హీరోలు సైతం పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.
ఇలా ఈ మధ్య కాలంలో ఎంతో మంది నూతన దర్శకులు..హీరోలు అవకాశం పొంది మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. ఈ రకంగా ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. అలాంటివారికి లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటి వేదికలు మంచి ఫ్లాట్ఫార్మ్స్  గా మారాయి. అయితే ఇప్పుడు అలాంటి ఒక సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఓ యంగ్ టీమ్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మరియు సపోర్ట్ లేకుండా  సినిమా తీశారు. తమ ప్రతిభ ఉపయోగించి సినిమాని తీర్చిదిద్దారు. అయితే ఆ సినిమా ఏంటంటే... 'ప్రయాణికుడు'. ఈ చిత్రానికి సంబంధించిన  ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేశారు. హీరో కొత్త కుర్రాడు కాగా దర్శకుడు విషయానికొస్తే గతేడాది 'అమరం అఖిలం ప్రేమ' అనే విభిన్న కథను తెరకెక్కించిన జోనతన్ ఎడ్వార్డ్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఆ నూతన కథానాయకుడి పేరు కృష్ణచైతన్య.
ఈ సినిమా ద్వారా కృష్ణ తెలుగు వెండి తెరకు పరిచయం కానున్నాడు. ఈ సినిమాను ఎం.కృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికొస్తే ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పోస్టర్ చూస్తుంటే హీరో ఎదో  ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కుర్రాడి జీవితం  సుధీర్ఘ ప్రయాణంలా ఈ చిత్రాన్ని చూపించపోతున్నారట. ఒక డిఫరెంట్ యాంగిల్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో హీరోయిన్ మరియు ఇతర పాత్రల గురించి ఇంకా తెలియలేదు. ఇదిలా ఉంచితే సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని ఆసక్తిగా ఉన్నారు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: