బావకు అండగా నిలిచిన మెగా బ్రదర్స్ ..!!

KISHORE
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలలో మెగా ఫ్యామిలి నుండి వచ్చిన హీరోలే ఎక్కువ. దాదాపుగా ఎనిమిది మంది మెగా హీరోలు అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.  మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ కూడా విజేత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే . అయితే మొదటి సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.  ప్ర‌స్తుతం ఈ హీరో కిన్నెర‌సాని అనే సినిమా చేస్తున్నాడు. వైవిధ్యమైన టైటిల్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'కిన్నెరసాని' టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
 తాజాగా ఈరోజు ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా  రాంచరణ్ ట్విటర్ లో కల్యాణ్ దేవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం నుంచి థీమ్ వీడియోను‌ విడుదల చేశారు. అలాగే మరొక మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన ట్విటర్ ఖాతాలో కల్యాణ్ దేవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. మరి ఈ థీమ్ వీడియో ను చూస్తే కాస్త ఆసక్తికరంగానే ఉంది  ఇందులో కాలిపోతున్న కాగితం గాలిలో ఎగురుతూ వచ్చిరోడ్డు మీద పడుతోంది. అందులో నుంచి అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. 
అయితే ఆ ఫోటోలో అమ్మాయి ఎవరనే విషయం మాత్రం తెలియదు. అదే సమయంలో వర్షం పడటం.. చివ‌ర‌లో క‌ళ్యాణ్ దేవ్ ఫొటో చూపించ‌డం ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి కల్యాణ్ దేవ్ ఒక వైవిద్యమైన కథతో రాబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరి మొదటి సినిమా "విజేత " తో నిరాశ పరిచిన కల్యాణ్ దేవ్ ఈ సినిమాతో ఎలాంటి విజయ్యాన్ని అందుకుంటాడో చూడాలి ఈ చిత్రానికి రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: