సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామ్ మూవీ

Malathiputhra
ఎట్టకేలకు థియేటర్వ్ లో తెర వెలుగులు ప్రారంభం అయ్యాయి .. ప్రేక్షకుల కేరింతలు మొదలైయ్యాయి .. థియేటర్స్ తెరుచుకున్నాయి .. ప్రతి రోజు ఆటలు ప్రదర్షితమవుతున్నాయి .. నిన్న కొన్ని సినిమాలు విడుదలవగా మరికొన్ని చిత్రాలు సనాక్రాంతి బరిలోకి రానున్నాయి ఈ నేపథ్యంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా రెడ్ చిత్రం రూపొందుతుంది .. ఈ సినిమాలు ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకుంది .. అయితే సంక్రాంతి కానుకగా రెడ్ చిత్రాన్ని విడుదల చేసేదుకు చిత్ర బృందం రెడీ అవుతుంది ...
 
ఇస్మార్ట్ శంకర్ తో అభిమానులకి పూనకాలు తెప్పించిన హీరో రామ్ . తన నటనతో మరియు డాన్సుతో ఇస్మార్ట్ సినిమాని స్మార్ట్ గా విజయ తీరాలకు చేర్చాడు .. సంక్రాంతి కానుకగా జనవరి 14న  రెడ్ చిత్రం  థియేటర్లో సందడి చేయనుంది  ... ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు.  కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై స్రవంత రవికిశోర్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ ఈరోజే రెడ్ సినిమా సెన్సె కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ సందర్బంగా సెన్సార్ బోర్డు తమ సినిమాకి  U/A సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత తెలిపారు .. రామ్ నటించిన  దేవదాసు, మస్కా సినిమా  తర్వాత సంక్రాంతికి వస్తున్న చిత్రం రెడ్ అని అన్నారు ..
ప్రేక్షకులకి నచ్చే  అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇస్మార్ట్ శంకర్ కి మ్యూజిక్ అందించిన  మణిశర్మరెడ్ చిత్రానికి  అందిస్తున్నారు . రెడ్ సినిమా ప్రేక్షకులని ఖచ్చితంగా థ్రిల్  చేస్తుందని ఇటీవల విడుదల చేసిన రెడ్ సినిమా  థియేట్రికల్ ట్రైలర్ కి మరియు పాటకి విశేష స్పందన వస్తుందని నిర్మాత తెలిపారు ..   రెడ్ చిత్రం వచ్చే ఏడాది  సంక్రాంతికి ప్రేక్షకులకి ముందుకు రానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: