చేతకాని పనులు చేసి పరువు పోగొట్టుకోకు అంటూ చిరంజీవి కి ఎందుకు యండమూరి వార్నింగ్ ఇచ్చాడు

Mamatha Reddy
మెగాస్టార్ చిరంజీవి, యండమూరి వీరేంద్రనాథ్ మధ్య చాలా ఏళ్ళ పాటు మంచి స్నేహబంధం కొనసాగింది. యండమూరి వీరేంద్రనాథ్ మంచి రచయిత కాగా ఆయన ఎన్నో సినిమాలకు కథలను అందించారు. చిరంజీవి హీరోగా నటించిన మంచుపల్లకి, అభిలాష, జగదేకవీరుని కథ, దొంగమొగుడు, రాక్షసుడు, చాలెంజ్ వంటి చిత్రాలకు యండమూరి వీరేంద్రనాథ్ కథలను అందించారు. ఈ సినిమాలు చేస్తున్న సమయంలో వీళ్లిద్దరి స్నేహం దృఢ పడింది.
చిరంజీవి కథానాయకుడిగా నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం కూడా వహించారు. ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి చిరంజీవి ప్రోద్బలమే ఉందని అంటుంటారు. నిజానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది కానీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మాత్రం యధాతధంగానే కొనసాగింది. అయితే మృగరాజు సినిమా డిజాస్టర్ అయిన తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికీ మృగరాజు సినిమా కారణంగానే చిరంజీవి, యండమూరి వీరేంద్రనాథ్ విడిపోయారని చాలామంది నమ్ముతుంటారు. వాస్తవం ఏమిటంటే ఈ సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ ఎటువంటి సంబంధం లేదు. మరొక విషయం ఏమిటంటే.. చిరు, యండమూరి మృగరాజు సినిమా కారణంగా విడిపోలేదట. ఈ విషయాన్ని యండమూరి వీరేంద్రనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మృగరాజు సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో తన కుమారుడి పెళ్లి జరుగుతుందని.. అప్పట్లో నాలుగు లక్షలు అవసరం ఉంటే చిరంజీవి ని అడిగాను అని ఆయన అన్నారు. ఐతే చిరంజీవి.. మృగరాజు సినిమాకి నిర్మాత అయిన నాగబాబు ని పిలిచి యండమూరి వీరేంద్రనాథ్ కి 4 లక్షలు ఇప్పించారట. అయితే అదే సమయంలో మృగరాజు సినిమా కథలో సలహాలను తీసుకుని నాలుగు లక్షల రూపాయలను నాగబాబు తన చేతికి ఇచ్చారని యండమూరి అన్నారు. దీని తర్వాత కూడా చిరు కి, యండమూరికి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాలేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి.
యండమూరి వీరేంద్రనాథ్ రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి ఎన్నోసార్లు చెప్పారట. "రాజకీయ రంగం చిరంజీవి వ్యక్తిత్వానికి అస్సలు సూట్ కాదు. ఆయన రాజకీయాలకు అస్సలు పనికి రారు" అని యండమూరి వీరేంద్రనాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చిరంజీవి కి అస్సలు నచ్చలేదు. ఇక ఆ క్షణం నుంచి చిరంజీవి, యండమూరి వీరేంద్రనాథ్ మధ్య మాటలు లేవు. మెగా బ్రదర్ నాగబాబు కూడా యండమూరి వీరేంద్రనాధ్ ని బాహాటంగానే విమర్శిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: