ఆ సినిమాలో నటించి ఉంటే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేది.. దురదృష్టం అంటే ఇదేనేమో....!!
ఇటీవల ఆహా యాప్ ద్వారా విడుదలై సంచలన విజయం సాధించిన ‘కలర్ ఫోటో’లో హీరోయిన్ పాత్రకు మొదట నిహారికనే సంప్రదించిందట యూనిట్.కానీ కరోనా టైమ్‌లో రిస్క్ చేయడం ఎందుకని భావించి ఆమె ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. దీంతో యూనిట్ చాందిని చౌదరిని తీసుకున్నారట.ఆ సినిమా విజయం సాధించడంతో పాటు హీరోయిన్ చాందిని చౌదరి, హీరో సుహాస్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాత్ర నిహారిక చేస్తే ఆమెకు మంచి పేరు రావడంతో పాటు కెరీర్లో ఓ హిట్ పడేది. అయితే తానే చేజేతులా మంచి ఆఫర్ వదులుకున్నానని నిహారిక ఇప్పుడు బాధపడుతోందట.
బహుశా దురదృష్టమంటే ఇదేనేమో... ఆ సినిమా చేసుంటే మెగా ఫ్యామిలీ నటిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించేది..ఇక సినిమాలకు ఫుల్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకొని స్థిరపడిపోవాలని అనుకుంటుందట నిహారిక.. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్ల గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు గురించి తెలుసుకోండి...