కార్తీక దీపం వంటలక్క తప్పుకుంటుందా ? ఇదిగో క్లారిటీ


కార్తీకదీపం సీరియల్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ పేరు వినిపిస్తే చాలు అందరూ ఆసక్తిగా దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.ఈ డైలీ సీరియల్ తెలుగు మహిళా ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర వంటలక్క  బాగా ఫేమస్. ఆ పాత్ర కోసమే ఈ సీరియల్ చూసేవారు ఎక్కువమంది ఉంటారు. ఆమె నటన అంతగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తీక దీపంలో వంటలక్క పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్ ఈ  సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. తెలుగు ప్రెకషకుల్లోనూ  మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. మలయాళం టీవీ సీరియల్ పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాధ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయమైంది. 

 

2014లో ప్రారంభమైనది ఈ సీరియల్ కార్తీకదీపం తెలుగు సీరియల్ మాతృక.  2017 లో కార్తీక దీపం గా తెలుగులో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ అందుకుంటూ టీఆర్పీ రేటింగ్ లో దూసుకు వెళుతోంది. వంటలక్క పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాధ్ ఓ విషయంలో ఇప్పుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం కార్తీకదీపం నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు వార్తలు రావడమే. ఈ విషయంపై నేరుగా ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. 

 

కార్తీకదీపం నుంచి నేను తప్పుకుంటున్నాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం వ్యూస్ కోసం ఓ యూట్యూబ్  ఛానల్ వారు కావాలని ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఆ ఛానల్ పై కేసు వేసేందుకు మా సీరియల్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని, ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచరం చేస్తే ఏమొస్తుంది..?  నా ఫ్రెండ్స్ బాధపడుతున్నారు అంటూ ఆమె సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: