తెలుగులో ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఇవే.. ఎంత అద్భుత చిత్రాలో!! 

Durga Writes

సినిమా.. అంటే ఒక కళ, ఒక పిచ్చి.. ఒక అభిమానం. సినిమా అంటే కథ, సంగీతం, స్క్రీన్ ప్లే, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా 24 రకాల కళలు కలిస్తే ఒక సినిమా అవుతుంది. ఇన్ని కళలు కలిసిన సినిమా గురించి ఎక్కడైనా ఎలా అయినా మాట్లాడుతుంటాం. సినిమా అంటే అది రా.. ఎం తీశాడు రా మా బాసు అని ఒకరు అంటే మా డైరెక్టర్ ఈసారి దుమ్ము దులుపుతాడు చూడు అంటూ మరి కొందరు అంటారు.   

 

ఇంట్లో కాలిగా కూర్చునే పుల్లయ్య నుండి పక్క దేశాలలో ఉద్యోగాలు చేస్తూ బిజీ లైఫ్ ఉన్నవారి వరుకు ప్రతి ఒక్కరు తెలుగు సినిమా గురించి.. వాటి రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న వచ్చిన ఆ సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని.. మా హీరో కలెక్షన్ రేంజ్ అది అని, కలెక్షన్లు మాస్ సీన్ల గురించి ఓ రేంజ్ లో మాట్లాడుతుంటారు.. అయితే అలాంటి సూపర్ హిట్ కలెక్షన్స్ తో థియేటర్ లను బద్దలు కొట్టిన ల్యాండ్ మార్క్ సినిమాలు 1932 సంవత్సరం నుండి 2017 వరుకు తెలుగులో ఏఏ సినిమాలు ఉన్నాయి ఇక్కడ చుడండి..

 

1932లో భక్త ప్రహల్లాదుడు సినిమా ఆ కాలంలోనే 50వేల షేర్లను సొంతం చేసుకుంది. ఇక్కడి నుండే సినిమా ఇండస్ట్రీ హిట్లు మొదలయ్యాయి. 


1933లో సావిత్రి సినిమా మొత్తం లక్ష షేర్లను తీసుకొచ్చింది. ఈ సినిమా కథ సతీసావిత్రి కథ.  


1934లో లవ కుశ సినిమా మొత్తం 5 లక్షల షేర్లను తీసుకొచ్చింది. ఆ రోజుల్లో 5 లక్షలు కలెక్ట్ చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాను తీసింది కూడా సావిత్రి సినిమా తీసిన చిట్టాజాలు పుల్లయ్య గారే తీశారు.  


1938లో మలపిల్లా అనే సినిమా ఏకంగా 10 లక్షల షేర్లను తీసుకొచ్చింది. ఇలాంటి సినిమా ఇప్పట్లో తియ్యాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో ఒక బ్రమహాన అమ్మాయి ఒక మాలపిల్ల మధ్య పుట్టే ప్రేమ కథ. 


1942లో భక్త పోతన సినిమా మొత్తం 20 లక్షల షేర్లను తీసుకొచ్చింది. ఈ భక్త పోతన సినిమా చూస్తే అనిపిస్తుంది.. బయోఫిక్ తిస్తె ఇలా ఉండాలి అని. 


1946లో త్యాగయ్య సినిమా మొత్తం 25లక్షల షేర్లను తీసుకొచ్చింది. 


1948లో బాలరాజు సినిమా 30లక్షల షేర్లను తీసుకొచ్చింది. అక్కినేని నాగేశ్వర్ గారి మొదటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇది. 


1949లో గుణసుందరి సినిమా 40 లక్షల షేర్లను తీసుకొచ్చిన మొదటి సినిమా ఇది. 


1951లో పాతాళభైరవి సినిమా మొత్తం 50లక్షల షేర్లను తీసుకొచ్చింది. ఎన్టీఆర్ గారి మొదటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇది. 


1953లో దేవదాసు సినిమా మొత్తం 55 లక్షల షేర్లను తీసుకొచ్చింది. ప్రేమ విఫలమైన ప్రతిఒక్కరు ఈ దేవదాసు గురించి తలుచుకుంటూనే ఉంటారు. ఇది నాగేశ్వర రావు రెండో ఇండస్ట్రీ హిట్ సినిమా. 


1955లో రోజులు మారాయి సినిమా మొత్తం 60 లక్షల షేర్లు వెళ్లాయి. ఈ సినిమా అక్కినేని నాగేశ్వర్ రావు మూడో ఇండస్ట్రీ హిట్ సినిమా. 


1957లో మాయ బజార్ మోత కోటి రూపాయిల కలెక్షన్ తెచ్చిన మొదటి చిత్రం. ఇది ఎన్టీఆర్, అక్కినేని, మహానటి సావిత్రి కలిసి నటిస్తే వచ్చిన సినిమా. కోటి రూపాయిల కలెక్షన్ సినిమా మాయ బజార్. 


1963లో లవ కుశ సినిమా కోటి 25 లక్షల రూపాయిల షేర్లు సొంతం చేసుకున్న సినిమా. 


1971లో దసరా బుల్లోడు సినిమాకు కోటి 5 లక్షల షేర్లు వచ్చాయి. ఈ సినిమా అక్కినేని 4వ సూపర్ హిట్టు. 


1974లో అల్లూరి సీతారామరాజు మొత్తం 2కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. ఇది సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ సూపర్ హిట్టు. 


1977లో అడవి రాముడు 3కోట్ల 25 లక్షల షేర్లను తీసుకొచ్చిన మొదటి సినిమా. ఇది ఎన్టీఆర్ 4వ ఇండస్ట్రీ హిట్టు. 


1981 ప్రేమాభిషేకం 4కోట్ల 50లక్షలు తెచ్చిన సినిమా. ఇది అక్కినేని 3వ ఇండస్ట్రీ హిట్ సినిమా. 


1987 పసివాడి ప్రాణం 4.75 కోట్ల షేర్లను తీసుకొచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్లు ప్రారంభమయ్యాయి. 


1988లో యముడికి మొగుడు సినిమా 5 కోట్ల షేర్లను తీసుకొచ్చింది. ఇది చిరంజీవి రెండో సూపర్ హిట్ సినిమా. 


1989లో శివ సినిమా 5కోట్ల 6లక్షలను కలెక్ట్ చేసింది. ఈ సినిమా నాగార్జున మొదటి సూపర్ ఇండస్ట్రీ హిట్ సినిమా. 


1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి మొత్తం ఆరు కోట్ల షేర్లను తీసుకొచ్చింది. ఇది చిరంజీవి 3వ ఇండస్ట్రీ హిట్ సినిమా. 


1991లో గ్యాంగ్ లీడర్ సినిమా 7కోట్లను కలెక్ట్ చేసింది. ఇది చిరంజీవి 4వ ఇండస్ట్రీ హట్. 


1992లో ఘరానా మొగుడు సినిమా మొత్తం 10కోట్ల షేర్లను తీసుకొచ్చింది. ఇది చిరంజీవి 5వ ఇండస్ట్రీ హిట్ సినిమా. 


1995లో పెద్దరాయుడు సినిమా మొత్తం 12 కోట్లు షేర్లను తీసుకొచ్చింది. ఈ సినిమా మోహన్ బాబు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. 


1999లో సమరసింహా రెడ్డి సినిమా మొత్తం 16.25 కోట్ల షేర్లను తీసుకొచ్చింది. ఇది బాలకృష్ణ మొదటి ఇండస్ట్రీ హిట్టు. 


2000లో నువ్వే కావాలి సినిమా మొత్తం 19 కోట్ల 5 లక్షల షేర్లను తీసుకొచ్చింది. 


2001లో నరసింహ నాయుడు సినిమా 21కోట్ల 75 లక్షల షేర్లను తీసుకొచ్చింది. ఈ సినిమా బాలకృష్ణ 2వ ఇండస్ట్రీ హిట్. 


2002లో ఇంద్ర సినిమా మొత్తం 25కోట్ల షేర్లను తీసుకొచ్చింది. ఈ సినిమా చిరంజీవి 6వ ఇండస్ట్రీ హిట్ చిత్రం. 


2006లో పోకిరి సినిమా 41 కోట్ల 2లక్షల షేర్లను తీసుకొచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు మొదటి ఇండస్ట్రీ హిట్.  


2009లో మగధీర సినిమా మొత్తం 71 కోట్ల 2లక్షల షేర్లను తీసుకొచ్చింది. రామ్ చరణ్ మొదటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇది. 


2013లో అత్తారింటికి దారేది మొత్తం 76కోట్ల 8లక్షల షేర్లను తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ మొదటి సూపర్ హిట్ చిత్రం ఇది. 


2015లో బాహుబలి మొత్తం 191 కోట్ల 5 లక్షల షేర్లను తీసుకొచ్చింది. ప్రభాస్ మొదటి సూపర్ హిట్ చిత్రం ఇది. 


2017లో బాహుబలి 2 మొత్తం 325కోట్ల షేర్లను తీసుకొచ్చి సినిమా తెలుగు ఇండస్ట్రీ సత్తా చాటారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువె. అంత సూపర్ హిట్ చిత్రం ఇది. 


చూశారుగా.. ఇవి మన తెలుగు సూపర్ ఇండస్ట్రీ హిట్ చిత్రాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: