బ్లాక్ డ్రెస్ లో తాప్సీ అందాలు..పిచ్చెక్కిస్తున్నాయి!

siri Madhukar
టాలీవుడ్ లో మంచు మనోష్ హీరోగా మోహన్ బాబు కీలక పాత్రలో ‘ఝుమ్మందినాధం’ సినిమాతో సొట్టబుగ్గల సుందరి తాప్సి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీలో తాప్సి అందాల ఆరోబోతతో ఒక్కసారే దర్శక,నిర్మాతల దృష్టిని ఆకర్షించింది.  వెంటనే తెలుగు లో వరుసగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా టాప్ రేంజ్ కి మాత్రం చేరుకోలేక పోయింది.  ఆమెతో పాటు సినీ పరిశ్రమలోకి వచ్చిన హీరోయిన్లు మంచి పొజీషన్ కి రావడంతో ఇక్కడ లాభం లేదనుకొని బాలీవుడ్ పయణమయ్యింది.  అక్కడ వరుసగా సక్సెస్ లు సాధించింది మంచి పొజీషన్ లోకి వచ్చింది తాప్సీ.

బాలీవుడ్ లో బిజీగా ఉన్నా సౌత్ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది.  సినిమాలతో పాటు మ్యాగజైన్ కవర్ పేజీ షూట్ లలో పాల్గొనడం, ఇతర హాట్ ఫోటో షూట్లు చేయడంతో సోషల్ మీడియాని హీటేక్కిస్తోంది. అప్పుడప్పుడు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై మీడియా సాక్షిగా నినదిస్తుంది.  అంతే కాదు మహిళా స్వేచ్చకోసం ఆ మద్య కొన్ని వీడియో షూట్స్ కూడా తీసింది. అవిసోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. 

తెలుగు లో ఆ మద్య హర్రర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఆనందో బ్రహ్మ మంచి హిట్ అయ్యింది.  తాజాగా తాప్సీ మరోసారి కుర్రాళ్లకు మతులు పోయే విధంగా షోటో షూట్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. తాజాగా ఎలి అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలను ఆగస్ట్ సంచికలో ప్రచురించారు.

ఫోటోషూట్ తో పాటు స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది తాప్సీ. ఫోటోషూట్ మారిషస్ లోని ఎల్ ఇంపీరియల్ రిసార్ట్ అండ్ స్పాలో జరిగిందని తెలుస్తోంది. ఈ ఫోటో షూట్స్ కోసం ఫుల్ లెంగ్త్ స్కర్ట్ వేసుకొని సిల్క్ జార్జెట్ షర్ట్ ధరించింది.  తన ఎద అందాల ఎక్స్ పోజింగ్ తో తాప్సీ అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం తాప్సీ నటించిన 'మిషన్ మంగళ్'.. 'సాంద్ కి ఆంఖ్'  విడుదలకు సిద్దంగా ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: