మనీ: అధిక వడ్డీ పొందాలి అంటే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీం లో చేరాల్సిందే..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది తమకు నచ్చిన పథకాలలో డబ్బులు పెడుతూ ఎక్కువ ఆదాయం పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా ఆలోచించే వారి కోసం పోస్ట్ ఆఫీస్ లో కూడా ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకాలతో చక్కటి లాభాలను పొందడమే కాదు అంతకుమించి అధిక వడ్డీ కూడా లభిస్తుంది. వాస్తవానికి బ్యాంకులతో పోల్చుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ పథకాలకు ఈమధ్య ప్రజలలో మంచి ఆదరణ పెరిగింది. పోస్ట్ ఆఫీస్ అందించే వాటిలో చాలా రకాలు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి పూర్తిగా సేఫ్ అని చెప్పవచ్చు. సీనియర్ సిటిజెన్లకు ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. పైగా వాటి వడ్డీ రేటు కూడా మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటుంది.
సీనియర్ సిటిజనులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఇలా పోస్ట్ ఆఫీస్ లో అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీం లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం కూడా ముఖ్యమైనది.  కాబట్టి దాని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 1000 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ స్కీం యొక్క కాలపరిమితి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. ఈ స్కీం కింద 8% వడ్డీ కూడా లభిస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది.  కాబట్టి ప్రతి మూడు నెలలకు వడ్డీరేట్లను ప్రభుత్వం మారుస్తున్న నేపథ్యంలో మీ వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం దీని లిమిట్ రూ.15 లక్షలు ఉంది.  ఈ స్కీం కాల పరిమితి ఐదు సంవత్సరాలు కావాలంటే మీరు మరో మూడు సంవత్సరలు పెంచుకోవచ్చు. టాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ పథకం ద్వారా పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: