మనీ: రూ.5000 పెట్టుబడితో లాభాలే లాభాలు..!

Divya
ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది బయటకెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలు భయపడుతున్నారు. ఇప్పుడు మరొకసారి కరోనా విజృంభిస్తున్న సమయంలో చాలామంది ఉద్యోగం కోసం వెతుక్కోకుండా ఇంటిపట్టునే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచనలో పడ్డారు. అందుకే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే మీ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు లేకపోయినా సరే కేవలం 5000 రూపాయలను పెట్టుబడిగా పెట్టి మంచి లాభాలను పొందవచ్చు . మరి ఆ వ్యాపారం ఏమిటో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.

ప్లాస్టిక్ వల్ల పర్యావరణం ఎంత నాశనం అవుతుందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని వాడకుండా ఉంటే మంచిది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నినాదాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ కప్స్ లో టీ, కాఫీ వంటివి తీసుకోవద్దు అని చాలామంది ఇలాంటివే అనుసరిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా మట్టి గ్లాసులలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది పైగా వాతావరణంకి కూడా ఎటువంటి హాని కలగదు. ప్రస్తుతం మట్కా చాయ్, తందూరి చాయ్, కుల్హాద్ చాయ్ ఇలా రకరకాలుగా టీలు మనకి కనపడుతున్నాయి అయితే వీటన్నింటిని కూడా మట్టితో చేసిన కప్పుల లోనే అమ్ముతారు. చాలా చోట్ల మట్టి కప్పుల్లోని టీ పోసి అమ్ముతున్న నేపథ్యంలో మట్టి కప్పులకు మంచి డిమాండ్ పెరిగింది.
మీరు ఈ మట్టి కప్పులు తయారు చేయడానికి నాణ్యమైన మట్టిని ఉపయోగించి.. ఏ పరిమాణంలో అయితే మీరు కప్పు చేయాలనుకుంటున్నారో అంత మోతాదులో అచ్చు తీసుకొని తయారు చేయవచ్చు. ముఖ్యంగా మట్టి కప్పులను తయారు చేసి స్ట్రాంగ్ అవ్వాలంటే వేడి చేయాలి. దీనికోసం పెద్ద కొలిమి కావాలి . కప్పులను కాల్చి మార్కెట్లో మీరు సేల్ చేయవచ్చు. ముఖ్యంగా ఇందులో టీ మాత్రమే కాదు.. పాలు, పెరుగు, జ్యూస్ వంటివి కూడా తాగొచ్చు. మట్టి కప్పులు పర్యావరణానికి మంచి చేకూర్చడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: