మనీ: రూ.95 పొదుపుతో రూ. 13 లక్షలకు పైగా ఆదాయం..!

Divya
సాధారణంగా డబ్బు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే సంపాదించిన డబ్బులు దాచుకోవాలని కూడా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలా మొదలు పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. పొదుపు చేయడానికి భారీ మొత్తంలో కావాలని అనుకుంటారు. కానీ తక్కువ డబ్బుతో కూడా పొదుపు ప్రారంభించవచ్చు.. రోజు మీరు కాఫీ, టీ , టిఫిన్ ల కోసం బయట ఎంత ఖర్చు చేస్తారో అంత పొదుపు చేసినా చాలు లక్షల రూపాయల రిటర్న్స్ వస్తాయి. ఇలా మంచి రిటర్న్స్ ఇచ్చే పొదుపు పథకాల గురించి మనం చదివి తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలను అందిస్తోంది అలాంటి పథకాల్లో సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం కూడా ఒకటి.

ఈ పథకంలో మీరు ప్రతిరోజు రూ. 95 చొప్పున పొదుపు చేస్తే రూ.13 లక్షల పైనే రిటర్న్స్ వస్తాయి.అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న వారు చేరవచ్చు. రూ. పది లక్షల సమ్ ఇన్సూర్డ్ తో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా వస్తాయి. ఈ పాలసీలో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి మధ్యలోనే డబ్బులు వస్తాయి.

ఒకవేళ పాలసీ హోల్డర్ 15 సంవత్సరాల పాలసీ తీసుకుంటే ఆరు సంవత్సరాల తర్వాత మనీ బ్యాక్ వస్తుంది. అలాగే తొమ్మిది సంవత్సరాలు , 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అలాగే 20 సంవత్సరాల పాలసీ  తీసుకుంటే ఎనిమిది సంవత్సరాలు , 12 సంవత్సరాలు, 16 సంవత్సరాల పూర్తయిన తర్వాత మనీ బ్యాక్ వస్తుంది . మిగతా 40% మెచ్యూరిటీ సమయంలో బోనస్ తో కలిపి తీసుకోవచ్చు.. ప్రతిరోజు 95 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాల పూర్తయిన తర్వాత రూ.13.72 లక్షలు ని చేతికి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: