మనీ: ఉద్యోగులకు శుభవార్త.. వచ్చేవారం ప్రకటన..?

Divya

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు కరువు బత్యం మరొకసారి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తున్నది. అందుకు సంబంధించి చర్చలు కూడా వచ్చేనెల కేబినట్ లో మాట్లాడుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ. 40 వేలకు పైగా పెరగనుంది. ఇక ఈసారి డి ఎ 5-6 శాతం పెరగడం ఖాయం అన్నట్లుగా తెలుస్తున్నది. తుది ప్రకటన మాత్రం ఆగస్టు-3 వ తేదీన ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత క్యాబినెట్ భేటీ అనంతరం ఈ విషయాన్ని తెలియజేయునన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ భేటీలో డిఏ తో పాటు ఉద్యోగుల జీతం విషయంలో కూడా అప్డేట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు 18 నెలల డి ఏ పెంపు  పై కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే రెండో డియర్ నెస్ అలవెన్స్.. గత నెల 31వ తేదీ లోపు ప్రకటిస్తారని కొన్ని నివేదికలు సూచించగా తాజా నివేదిక ప్రకారం ఆగస్టు మూడవ తేదీన ఆ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే గడిచిన రెండు సంవత్సరాల క్రితం కరువుభత్యాన్ని కరోనా మహమ్మారి వల్ల కేంద్రం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత మాత్రం ఆమోదముద్ర లభించినా ఇప్పటికీ 18 నెలలుగా డిఏ క్లియర్ కాలేదు. అయితే ఇప్పుడు డిఏ లో నాలుగు శాతం పెంపుదల వల్ల రూ.18000 బేసిక్ జీతం కోసం సంవత్సరానికి రూ.8,640  మరియు రూ.56,000 జీతం కోసం ఏడాదికి రూ.27,312 పెరుగుతుందని అంచనా.. ఇక ప్రస్తుతం రూ.18,000 బేసిక్ జీతం కలిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 34% ఫిట్నెస్ ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే ప్రతి నెల రూ.6120 డి ఎ లభిస్తుందన్నమాట .ఈ మొత్తం నెలకు.. రూ.6,840 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నది. దీని ప్రకారం నెలవారి డిఏ లో రూ.720 రూపాయలు పెరుగుతుంది. ఉద్యోగుల జీతాన్ని బట్టి డిఏ లో మార్పులు ఉండును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: