మనీ: చిన్న పథకాలతో ఎక్కువ రాబడి.. ఎలా అంటే..?

Divya
సాధారణంగా చిన్న పొదుపు పథకాలు ఎప్పుడూ కూడా భారీ రాబడిని అందించవు. కానీ క్రమశిక్షణతో గనుక మన పొదుపు చేసినట్లయితే ఈ చిన్న పథకాలే మీకు అండగా నిలుస్తాయి. చిన్న పొదుపు పథకాలపై స్పందించే వడ్డీరేట్లను కూడా ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. పోస్ట్ ఆఫీస్ లో అనేక రకాల చిన్న పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక బ్యాంకు డీఫాల్ట్ అయితే మీరు ఐదు లక్షలు మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కానీ పోస్టాఫీసులో అలా ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేస్తుంది కాబట్టి మీ పొదుపు పథకాలు మీరు చాలా తక్కువ మొత్తంలో కూడా ప్రారంభించవచ్చు. ఇండియా పోస్ట్ అందించే వివిధ పథకాలను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్,  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,  సుకన్య సమృద్ధి యోజన అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలు.
ఇక ప్రజలు పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలను తెరిచి మంచి రాబడులను కూడా పొందుతున్నారు. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద మీరు 15 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక పెట్టుబడిని పెట్టినట్లయితే 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. మీకు అవసరమైతే మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు. ఇక మీరు ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం 500 రూపాయల నుంచి పొదుపు చేసుకోవచ్చు .. గరిష్టంగా 1.5 లక్షల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ విషయానికి వస్తే
. ఇందులో కనీసం డిపాజిట్ వెయ్యి రూపాయలు ఉండాలి. ఈ పథకం యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు.. ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తోంది. రిస్క్ ఉండదు పథకం యొక్క మెచ్యూరిటీ సమయంలో పూర్తి వడ్డీని పొందవచ్చు.
ఇక సుకన్య సమృద్ధి యోజన పథకం విషయానికి వస్తే.. ఆడ పిల్లల భవిష్యత్తు ను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో 7.6 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. కనిష్టంగా 250 రూపాయలను మొదలుకొని గరిష్టంగా సంవత్సరానికి 1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. అయితే ఆడపిల్ల వయసు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ పథకం ముగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: