మనీ : యువతను లక్ష్యంగా పెట్టుకున్న అమెజాన్ ప్రైమ్..50% డిస్కౌంట్ తో..!!

Divya

ప్రస్తుతం థియేటర్ల కన్నా ఓటీటీ సేవలే ఎక్కువగా విస్తరిస్తున్నాయి.. అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ రంగంలోకి దిగడంతో తీవ్రంగా పోటీ పెరిగిందని చెప్పవచ్చు.. అందుకే యూజర్లను ఆకర్షించే క్రమంలో చాలా కంపెనీలు పలు ఆకర్షణీయమైన ఆఫర్లతో యువతని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.. ఇదిలా ఉండగా మరో పక్క ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలను పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే..
ఇక ఈ క్రమంలోనే కొత్త యూజర్లను ఆకర్షించే క్రమంలో మరీ ముఖ్యంగా యువత కోసం ఒక అతిపెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించింది.. అమెజాన్ ప్రైమ్.. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువకులను టార్గెట్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని వారికి 50 శాతం వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ ని కూడా ప్రకటించడంతో ప్రస్తుతం యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఎవరైనా సరే అమెజాన్ ప్రైమ్ లో చేరితే ముఖ్యంగా యూత్ ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది.. ఇందుకోసం యూజర్లు ప్రైమ్ యాప్ లోని రెఫరల్ స్పేస్ నుంచి ఇందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి..
మీరు మీ ఫ్రెండ్స్ కు పంపించిన రెఫరల్ కోడ్ తో వారు కూడా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మరో పదిహేను రోజుల పాటు ఉచితంగా మెంబర్షిప్ పొందే అవకాశం ఉంటుంది.. అంతేకాదు రెఫరల్ కోడ్ పంపిన వారికి 60 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంటుంది.. ఇందుకోసం యూజర్లు తమ వయసు దృవీకరణ చేయడానికి ఒక సెల్ఫీ తో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందట.

ఇక ప్లాన్ వివరాల విషయానికి వస్తే నెల రోజులకు 179 సబ్స్క్రిప్షన్ చేసుకుంటే.. ఇందులో 50% అనగా 90 రూపాయలను క్యాష్ బ్యాక్ అలాగే రెఫరల్ రివార్డ్ గా 18 రూపాయలను  క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.అలాగే మూడు నెలలకు అయితే  రూ. 479లకి తీసుకుంటే..50% క్యాష్ బ్యాక్ తో రూ. 230 క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ. 64 రిఫరల్‌ రివార్డ్‌ క్యాష్‌బ్యాక్‌ను కూడా  పొందొచ్చు. ఇక ఏడాదికి గాను 50%  తో రూ. 1499పై రూ. 750 అలాగే రూ. 150 రివార్డ్‌ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఈ క్యాష్‌ బ్యాక్‌ మొత్తం అమెజాన్‌ పే అకౌంట్‌లో యాడ్‌ అవుతుందని గుర్తించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: