హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు మళ్ళీ టికెట్ కష్టమేనా?

రాష్ట్రంలో జగన్ పాలన ఎంత బాగున్న సరే ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగోవాలి. అప్పుడే ప్రజలు వైసీపీకి మద్ధతు తెలుపుతారు. లేదంటే వైసీపీకి ఇబ్బందే అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్తితులని బట్టి చూస్తే సి‌ఎంగా జగన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. అలాగే కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకు మంచి మార్కులే వస్తున్నాయి. కానీ కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు నెగిటివ్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇంకా మరికొందరైతే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.


అలా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గూడూరు నుంచి వరప్రసాద్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే, అందుకు తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ముందు నుంచి గూడూరులో వరప్రసాద్ పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఎమ్మెల్యే చేసే పనులు ఏమి లేవు.
అలాగే వరప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా తక్కువే అని టాక్....ఇక గూడూరులో దందాలు, ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా తాగునీరు, సాగునీరు సమస్యలు ఎక్కువ. రోడ్ల పరిస్తితి దారుణంగా ఉంది. అసలు ఎమ్మెల్యేకు ఇక్కడున్న ఏకైక ప్లస్ పాయింట్ జగన్ ఇమేజ్
అందుకే స్థానిక ఎన్నికల్లో గూడూరులో వైసీపీకి అదిరిపోయే విజయాలు దక్కాయి. అలాగే గూడూరు వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. వరప్రసాద్ తీరుపై పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి లాంటి నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.  గూడూరులో టీడీపీ తరుపున పాశం సునీల్ కుమార్ పనిచేస్తున్నారు. సునీల్ దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. టి‌డి‌పిని బలోపేతం చేసుకుంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వరప్రసాద్ వైసీపీ తరుపున నిలబడితే పాశం గెలుపు సులువే అని తెలుస్తోంది. అందుకే వరప్రసాద్‌ని నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ పక్కనబెట్టే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: