హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బాబూరావుకు బంపర్ ఆఫర్ ఉంటుందా?

త్వరలోనే ఏపీలో మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు ఈ సారి తమకు ఛాన్స్ దక్కకపోదా అని ఎదురు చూస్తున్నారు. అలా మంత్రి పదవి కోసం ఎదురు చూసే వాళ్ళలో సీనియర్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా ఒకరు. 2009 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి కాంగ్రెస్ తరుపున విజయం సాధించిన గొల్ల బాబూరావు...ఆ తర్వాత వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ వెంట నడిచారు.
ఈ క్రమంలోనే 2012 వచ్చిన ఉపఎన్నికలో వైసీపీ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో మరోసారి బాబూరావు వైసీపీ తరుపున విజయం సాధించారు. సీనియర్ నేత కావడం, పైగా వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడు కావడంతో బాబూరావుకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మొదటసారి సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా బాబూరావుకు పదవి మిస్ అయింది. అయితే ఈ సారి మాత్రం తనకు ఖచ్చితంగా పదవి దక్కుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. మరి జగన్, బాబూరావుకు బంపర్ ఆఫర్ ఇస్తారో లేదో త్వరలో తెలుస్తోంది.


మంత్రి పదవి పక్కనబెడితే ఎమ్మెల్యేగా బాబూరావు పర్వాలేదనిపిస్తున్నారు. రెండేళ్లలో బాబూరావు పనితీరుకు ఎవరేజ్ మార్కులు పడుతున్నాయని చెప్పొచ్చు. పైగా టి‌డి‌పి నాయకురాలు వంగలపూడి అనిత దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా పాయకరావుపేట టి‌డి‌పికి కంచుకోట. దీంతో అక్కడ టి‌డి‌పి వేగంగానే పికప్ అవుతుంది. పైగా బాబూరావుకు కూడా ఈ మధ్య సర్వేల్లో వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎన్నికల్లో బాబురావుకు విజయం దక్కడం కష్టమైపోతుంది. కాకపోతే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే ఎమ్మెల్యేకు ప్లస్ అవ్వాలి. పైగా మంత్రి పదవి వస్తే బాబూరావుకు రాజకీయంగా కూడా కలిసి రావొచ్చు చూడాలి మరి బాబూరావుకు మంత్రి పదవి వస్తుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: