హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీనివాస్‌కు బూరుగుపల్లితో కష్టమే?

వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది...ఈ రెండేళ్లలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు పనితీరులో మంచి మార్కులే పడుతుంటే, కొందరు ఎమ్మెల్యేలకు నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. మరికొందరు ఎమ్మెల్యేలు పాస్ మార్కులు దక్కించుకోవడం కష్టపడుతున్నారు. అలా పాస్ మార్కులు కోసం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేల్లో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కూడా ఒకరు.
తొలిసారి నిడదవోలు బరిలో గెలిచిన శ్రీనివాస్ నాయుడుకు నియోజకవర్గంలో అంత అనుకూల పరిస్తితులు ఉన్నట్లు కనిపించడం లేదు. రాజకీయంగా కూడా ఈయన బాగా బలపడలేదు. కాకపోతే ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అవి కూడా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేకు ఫుల్ నెగిటివ్ మార్కులు వచ్చేవి.
అయితే నియోజకవర్గంలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్తితి మరీ అధ్వాన్నంగా ఉంది. నిడదవోలు - పెరవలి రహదారి మరీ ఘోరంగా ఉంది. అటు రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులు సరిగ్గా అందడం లేదు. ఇక ఇసుక, ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమాలు ఎక్కువగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అటు ఇళ్ల స్థలాలని చదును చేసే పేరుతో వైసీపీ నేతలు కోట్లు కొట్టేశారని టీడీపీ ఆరోపిస్తుంది.
ఈ పరిణామాలు వైసీపీ ఎమ్మెల్యేకు బాగా నెగిటివ్ అవుతుండగా, ఇవే టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావుకు బాగా ప్లస్ అవుతున్నాయి. పైగా ఈయన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. స్థానికంగా ఉంటూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కానీ ఎమ్మెల్యే స్థానికంగా పెద్దగా అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. దీంతో రెండేళ్లలో నియోజకవర్గంలో వైసీపీపై వ్యతిరేకత పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నేత బూరుగుపల్లి బాగానే పుంజుకున్నారని, వచ్చే ఎన్నికల్లో నిడదవోలులో టీడీపీకి మంచి ఛాన్స్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్‌కు బూరుగుపల్లితో కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: