హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆనం సైలెన్స్ ఎందుకో?

ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి పూర్తిగా సైలెంట్‌ అయిపోయినట్లు కనిపిస్తోంది. దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన ఆనం ఇప్పుడు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మొదట తెలుగుదేశంలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగి, ఉమ్మడి ఏపీకి మంత్రిగా సేవలు చేసిన ఆనం, మళ్ళీ టీడీపీలోకి వచ్చి రాజకీయాలు చేశారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి, వెంకటగిరి వైసీపీ టికెట్ దక్కించుకుని భారీ మెజారిటీతో గెలిచారు.
అయితే సీనియర్ నేత కావడంతో మొదట్లో మంత్రి పదవి ఆశించారు..కానీ పదవి దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. కాకపోతే మొదట్లో సొంత పార్టీపైనే అసంతృప్తి రాగం అందుకున్నారు. తన నియోజకవర్గానికి నిధులు సరిగ్గా అందడం లేదని మాట్లాడిన ఆనం, జిల్లాలో ఉన్న కొందరు జూనియర్ వైసీపీ ఎమ్మెల్యేలతో విభేదాలు వచ్చాయి. అలాగే మంత్రి అనిల్ కుమార్‌పైన డైరక్ట్‌గా విమర్శలు చేసిన సందర్భం ఉంది.
మరి ఇలా సొంత పార్టీపైనే విమర్శలు చేసిన గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధిష్టానం హెచ్చరించడంతో వెనక్కి తగ్గారా? లేక పరిస్తితులు అనుకూలంగా లేవని సైలెంట్ అయిపోయారా?అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇటీవల తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో వెంకటగిరి నుంచి వైసీపీకి భారీ మెజారిటీనే వచ్చింది. అలాగే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. అటు ప్రభుత్వం తరుపున ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వెంకటగిరిలో జరుగుతున్నాయి.
ప్రస్తుతానికి వెంకటగిరిలో ఆనం బలంగానే ఉన్నారు. ఇక్కడ టీడీపీ తరుపున కురుగొండ్ల వెంకటరామకృష్ణ పనిచేస్తున్నారు. ఈయన కూడా దూకుడుగానే పనిచేసుకుంటూ, టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే వైసీపీలో ఉండే అసంతృప్తి టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఆనం రాజకీయం ఎలా ఉంటుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: