హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రవికి బ్రహ్మానందరెడ్డి చెక్ పెట్టడం కష్టమేనా?

కర్నూలు జిల్లాలో వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో నంద్యాల ఒకటి. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీనే విజయం సాధించింది. అయితే మధ్యలో నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. 2014లో వైసీపీ తరుపున భూమా నాగిరెడ్డి విజయం సాధించగా, ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చేశారు. ఇక అనారోగ్యంతో భూమా మరణించడంతో నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది.


ఆ ఎనికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. కానీ అప్పటివరకు టీడీపీలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వచ్చి, ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లోచ్చేసరికి శిల్పా తనయుడు రవి చంద్రకిషోర్ రెడ్డి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రవి నంద్యాల నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందున్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. నంద్యాలలో కొత్తగా వైఎస్సార్ హెల్త్ కేర్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, నూతన హాస్పిటల్స్, సి‌సి రోడ్లు, జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు యాళ్ళూరు గ్రామంలో 30 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం జరుగుతుంది. అలాగే నంద్యాల టౌన్‌లో రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం జరుగుతుంది.
నంద్యాలలో రాజకీయంగా చూసుకుంటే శిల్పా రవిదే పైచేయిగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ తరుపున భూమా బ్రహ్మానందరెడ్డి వర్క్ చేస్తున్నారు. ఈయన ఒకోసారి పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు, మరొకసారి అడ్రెస్ ఉండటం లేదు. అయితే భూమా వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ వీక్ కావడంతో, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ హవా నడిచింది. ఏదేమైనా నంద్యాలలో రవికి భూమా చెక్ పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: