హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేకు టీడీపీతోనే ఇబ్బందా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ కండువా కప్పుకోకుండా వారు జగన్‌కు మద్ధతు తెలిపి అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా నడుస్తున్నారు. అంటే తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తెలివిగా, టీడీపీని వీడి, వైసీపీలో చేరకుండా, ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చారు.


అలా టీడీపీని వీడిన నలుగురులో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ కూడా ఉన్నారు. 2014లో టీడీపీ తరుపున విశాఖ సౌత్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అయిన వాసుపల్లి, 2019 ఎన్నికల్లో సైతం అదే టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక కొన్ని నెలలు టీడీపీలో యాక్టివ్‌గా పనిచేసిన వాసుపల్లి తర్వాత అనూహ్యంగా వైసీపీ వైపుకు వచ్చారు.


వైసీపీ వైపుకు వచ్చాక గణేశ్ బాగానే పనిచేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు కరోనా వేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఆర్ధికంగా అండగా నిలబడ్డారు. అలాగే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న తన అనుచరులకు సైతం సాయం చేశారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టారు. అలాగే ప్రభుత్వ పథకాల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చేస్తున్నారు. టీడీపీ-వైసీపీ అనే తేడా లేకుండా పథకాలు అందిస్తున్నారు.


ఇక వాసుపల్లి టీడీపీని వీడాక, సౌత్‌లో ఆ పార్టీని నడిపించే నాయకుడే లేదు. మొదట్లో బాలయ్య చిన్నల్లుడు కాస్త యాక్టివ్‌గా ఉన్నారుగానీ, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడు కావాల్సి ఉంది. నాయకుడు లేకపోయినా సరే సౌత్‌లో టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో సౌత్ పరిధిలో టీడీపీ మంచి విజయమే సాధించింది. వైసీపీకి పోటీగా డివిజన్లు గెలిచింది. కాబట్టి వాసుపల్లికి టీడీపీతో కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: