హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేని విజయసాయి టార్గెట్ చేశారా?

జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక విశాఖలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అమరావతికి మద్ధతుగా నిలబడటంతో విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలకు కష్టాలు మొదలయ్యాయి. అలాగే విశాఖ కార్పొరేషన్ గెలవాలని చూస్తున్న వైసీపీ, నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని పార్టీలోకి లాగడమో, లేక వీక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.
ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయి అదిరిపోయే వ్యూహాలు వేస్తూ, టీడీపీని దెబ్బకొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విజయసాయి వ్యూహంలో భాగంగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ టీడీపీని వీడి వైసీపీ వైపుకు వచ్చారు. అటు నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వెస్ట్ ఎమ్మెల్యే గణబాబులు కాస్త యాక్టివ్‌గా ఉండటం తగ్గించారు. ఇక టీడీపీకి ఫుల్ సపోర్ట్ ఉన్న ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుని విజయసాయి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి వరుసగా మూడుసార్లు గెలిచారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలిచారు. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో అనుకున్నంత నిధులు అందడం లేదు. అయినా సరే తనకు సాధ్యమైన వరకు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు.
అయితే రాజధాని విషయంలో వెలగపూడిని వైసీపీ టార్గెట్ చేసింది. ఇప్పటికే పలుమార్లు రామకృష్ణ ఇంటి ముందు ధర్నాలు కూడా చేసారు. తాజాగా విజయసాయి, వెలగపూడి భూ కబ్జాలు చేశారని, వాటిని స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే తాను ఎలాంటి కబ్జాలు చేయలేదని, విజయసాయినే కబ్జాలు చేస్తున్నారని వెలగపూడి రివర్స్ అయ్యారు. అలా అలా వీరు దేవుడు మీద ప్రమాణాలు చేసుకునే వరకు వెళ్లారు. ఈ విషయాన్ని పక్కనబెడితే విశాఖ కార్పొరేషన్‌పై పట్టు సాధించాలంటే ఈస్ట్‌లో టీడీపీ బలం తగ్గించాలి. అందుకే వెలగపూడిని విజయసాయి టార్గెట్ చేసి అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: