హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి తిరుగులేదు...టీడీపీకి దిక్కులేదు

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బాగా వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో రాజాం ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీ గెలుపు రుచి చూడలేదు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి కంబాల జోగులు విజయం సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్న జోగులు రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే. 2004లో టీడీపీ టికెట్ దక్కించుకుని వైఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ అభ్యర్ధిపై పాలకొండ నుంచి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడం, వైసీపీ ఆవిర్భవించడంతో అటు వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో రాజాం నుంచి పోటీ చేసి, టీడీపీ సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతిపై కేవలం 512 ఓట్ల తేడాతో గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీ నుంచి పోటీ చేసిన కొండ్రు మురళిపై విజయం సాధించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన జోగులు దూకుడుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. దీని వల్ల జోగులుకు రాజాంలో తిరుగులేకుండా పోయింది.

ఇదే సమయంలో రాజాంలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. ఇక్కడ టీడీపీ తరుపున కొండ్రు మురళి పెద్ద యాక్టివ్ గా ఏమి పనిచేయడం లేదు. ఆయన పార్టీ మారిపోయే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. అటు ప్రతిభా భారతి కూడా పెద్దగా పార్టీలో కనిపించడం లేదు. దీంతో రాజాంలో టీడీపీ కేడర్ చెల్లాచెదురైపోయింది.

ఇక రాజాంలో సమస్యలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వం పథకాల మీద దృష్టి పెట్టడంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రాజాం రైతుబజార్‌లో సదుపాయాలు లేక రైతులు రోడ్డుపైనే అమ్మవలసి వస్తుండటంతో వీధులు మరింత రద్దీగా తయారయ్యి, స్థానికులకు అసౌకర్యం కలిగిస్తున్నది. ఎర్రచెరువు విస్తరణ, బలసాల రేవులో నాగావళి నది మీదుగా వంతెన నిర్మించాలని రాజాం వాసులు దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. వంగర మండలంలో త్రాగు నీటి సమస్య అధికం. రేగిడి ఆమదాలవలస మండలంలో జూనియర్ కాలేజీ అవసరం. సంతకవిటి మండలంలో రోడ్ల సౌకర్యం పెద్దగా లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: