హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఈ సారి హరీష్ మెజారిటీ ఎంత?

అవును సిద్ధిపేటలో ఈ సారి హరీష్ రావు ఎంత మెజారిటీతో గెలుస్తారు? పాత మెజారిటీని దాటుతారా? లేదా? అనే దానిపైనే సిద్ధిపేట రాజకీయాలు నడుస్తున్నాయి...ఎందుకంటే ఇక్కడ గెలుపోటములని మాట్లాడుకోవడానికి లేదు..కేవలం హరీష్ మెజారిటీ ఎంత అనే దానిపైనే చర్చ తప్ప...హరీష్ ఓటమి గురించి మాట్లాడటానికి లేదు. అసలు సిద్ధిపేటలో ఇంతవరకు హరీష్ ఓటమి పాలవ్వలేదు...భవిష్యత్‌లో కూడా ఓడిపోయే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.
అసలు సిద్ధిపేట అంటే మొదట్లో టీడీపీ కంచుకోటగా ఉండేది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. అయితే తర్వాత తనకు క్యాబినెట్‌లో ప్రాధాన్యత దక్కకపోవడం, ప్రత్యేక తెలంగాణ అంశం తెరపైకి రావడంతో కేసీఆర్..టీడీపీ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టి..2001 ఉపఎన్నికలో సిద్ధిపేట నుంచి కేసీఆర్ గెలిచారు.
ఇక 2004 ఎన్నికల్లో కేసీఆర్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని..సిద్ధిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా గెలిచారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు..ఈ క్రమంలో సిద్ధిపేటకు ఉపఎన్నిక రాగా, ఆ ఎన్నికలో హరీష్ రావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ నుంచి హరీష్ విజయాలకు బ్రేక్ పడలేదు. అలాగే 2008లో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..మళ్ళీ 2008 ఉపఎన్నికలో సిద్ధిపేట బరిలో భారీ మెజారిటీతో గెలిచారు.
ఇక 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది...ఈ క్రమంలో హరీష్ మరొకసారి సిద్ధిపేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2010లో మరొకసారి తెలంగాణ కోసం రాజీనామా చేసి...2010 ఉప ఎన్నికలో 95 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే తర్వాత తెలంగాణ ఉద్యమంలో హరీష్ ఎంత కీలకంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి ఐదోసారి పోటీ చేసి దాదాపు 93 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే తొలిసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, హరీష్..నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక సిద్ధిపేటని అభివృద్ధి పథంలో నడిపించారు.
అలాగే 2018 ఎన్నికల్లో హరీష్ లక్షా 20 వేల 650 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు..ఇక కేసీఆర్ క్యాబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా సిద్ధిపేటలో ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే సిద్ధిపేటలో హరీష్‌ని ఓడించడం చాలా కష్టం...ఆయన మెజారిటీ తగ్గించడం తప్ప...ఇంకా ప్రతిపక్షాలు ఏమి చేయలేవు. మరి ఈ సారి హరీష్ ఎంత మెజారిటీతో గెలుస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: