హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ మంత్రి గారు...ఎమ్మెల్యేగా కూడా మైనస్సేనా?

ఈ రెండున్నర ఏళ్ల కాలంలో అంటే...వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ మంత్రి ఎక్కువగా వివాదాల్లో ఉన్నారంటే...నలుగురైదుగురి పేర్లు ముందు వరుసలో ఉంటాయి గానీ, అందులో టాప్‌లో మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జయరాం మంత్రిగా...రెండున్నర ఏళ్లలో ఎంతగా మంచి పేరు తెచ్చుకున్నారో చెప్పాల్సిన పని లేదు. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు..కానీ ఆ శాఖకు సంబంధించి జయరాం చేసిన మంచి పనులు ఏవి? అంటే అబ్బే ఠక్కున మాత్రం చెప్పలేమనే చెప్పాలి.
మరి జయరాంకు ఉన్న నెగిటివ్ ఏంటంటే...బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని, భూ కబ్జాలు చేశారని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారని, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు చేశారని...ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఏంటి జయరాంపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా జయరాంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చింది. సరే ఆరోపణలు సహజమే...ఈయన మంత్రిగా అదిరిపోయే పనితీరు కనబరుస్తున్నారా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. ఆయన ఎలాంటి పనితీరు కనబరుస్తున్నారో సొంత పార్టీ నేతలకే బాగా క్లారిటీ ఉంది.
సరే మంత్రిగా పక్కనబెడితే ఆలూరు ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండటం..ప్రజల సమస్యలని పరిష్కరించడం లాంటివి ఏమన్నా చేస్తున్నారా? అంటే ఈ ప్రశ్నలకు కూడా పెద్దగా సమాధానాలు రావనే చెప్పాలి. అసలు పలు సర్వేల్లో ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో జయరాం ముందు వరుసలో ఉన్నారు.
కాకపోతే ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, కొన్ని అభివృద్ధి పనులు మాత్రమే ప్లస్ ఉందని చెప్పొచ్చు. ఇక ఆలూరులో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలూరులో రోడ్ల పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా శూన్యమే. అంటే అన్నీ రకాలుగా ఇక్కడ మంత్రిగారికి మైనస్సే అని చెప్పాలి. ఈ మైనస్‌ని ఉపయోగించుకుంటే టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మకు ప్లస్ అవుతుంది. కానీ ఆమె కూడా అంత దూకుడుగా ఆలూరులో పనిచేయడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: