ఆరోగ్యశ్రీ పథకానికి గుడ్ బై చెప్పనున్నారా.. ప్రజలకు భారీ షాక్ తప్పదా?

Reddy P Rajasekhar

ఆరోగ్యశ్రీ పథకం రూపు రేఖలు మారబోతున్నాయా? అనే ప్రశ్నకు ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆరోగ్యశ్రీ కార్డును కలిగి ఉన్నవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకునే అవకాశం అయితే ఉందనే సంగతి తెలిసిందే. ఈ కార్డును కలిగి ఉన్నవాళ్లు డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఈ పథకం మాత్రం అమలవుతూ వస్తోంది.

పేర్లు మారినా పథకం మాత్రం కొనసాగుతూ వస్తోంది.  అయితే తాజాగా  ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందేలా ఈ పథకం కొనసాగుతోంది.  ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా ఈ పథకం అమలు కానుందని తెలుస్తోంది.    రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది తెలుస్తోంది.

2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానంను ఫాలో అయ్యి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.  3,257 చికిత్సలను ఈ విధానం  ద్వారా ఫ్రీగా అందించనున్నారు.  ప్రీ-ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం సైతం  తెలుస్తోంది.  రూ.2.5 లక్షల లోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనుండగా  ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య ఖర్చులు  భరించనుంది.  

ఈ కొత్త స్కీమ్  2.5 లక్షల పేద కుటుంబాలతో పాటు  20 లక్షల ఇతర కుటుంబాలకు సైతం ప్రయోజనం చేకూర్చనుంది.  త్వరలో ఈ పథకానికి  సంబంధించిన పూర్తీ వివరాలు వెల్లడి కానున్నాయి.  యూనివర్సల్ హెల్త్ స్కీమ్  అమలుపై ఏపీ  ప్రజల రియాక్షన్ ఏ విధంగా  ఉండనుందో  చూడాల్సి ఉంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: