వేసవిలో అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. ముఖానికి ఇది రాయండి..!
ధ్యానం చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తక్షణమే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో ఫేస్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గులాబీ టేకుల్లో కొద్దిగా తేనె కొద్దిగా పాలు, గంధం, కుంకుమపువ్వు ఇవి తీసుకోవాలి. ఇవన్నీటిని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.
వేసవిలో ప్రతిరోజు సన్ స్క్రీన్ రాయడం వల్ల యూవీ కిరణాలు వల్ల ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుంది. చర్మంపై మచ్చలు లాంటివి కలగవు. అందంగా కనబడవచ్చు. వేసవిలో తేలికపాటి మాయిశ్చరైసర్ అప్లై చేయండి. దీంతో స్కిన్ హైడ్రాయిడ్ గా ఉంటుంది. ఎండలో ఇది పర్పెక్ట్ గా ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటే ఒంట్లో ఉన్న విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. డిహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. స్కిన్ అందంగా, తాజాగా ఉంటుంది. ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. స్కిన్ బాగుంటుంది. అందంగా, కాంతివంతంగా ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లు ఎక్స్ పోలియేట్ చేయడం మంచిది. వేసవి కాలంలో హవీమేకప్ వేసుకోవడం మంచిది కాదు. వేడి వల్ల చమట, నూనెతో ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు లైట్ మేకప్ వేయడం మంచిది.