చక్కని జుట్టును పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ నూనె మీ కోసమే..!

lakhmi saranya
చక్కని, ఆరోగ్యమైన, మందమైన జుట్టు కావాలంటే సరైన నూనెను ఉపయోగించడం చాలా ముఖ్యం. మిమ్మల్ని ఆకట్టుకునే జుట్టును పొందేందుకు ఈ నూనె మీ వాడకంలో ఉండాలి. కొబ్బరి నూనె, జుట్టు ఎదుగుదల పెంచుతుంది. జుట్టు ఊడిపోవడం తగ్గిస్తుంది. చుండ్రును తగ్గించేందుకు సహాయపడుతుంది. గోరు వేడినీటిలో కొబ్బరి నూనెను వేడిచేసి, తలకి మర్దన చేయాలి. 1-2 గంటలు తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. అరగాన్ నూనె, పొడిబారిన, తేలిపోయిన జుట్టుకు అద్భుతమైన పరిష్కారం. హీట్ డ్యామేజ్ & కెమికల్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది.

తలస్నానం చేసిన తర్వాత కొన్ని చుక్కల అరగాన్ నూనెను జుట్టుకు అప్లై చేయాలి. జటామాంసి నూనె,జుట్టు తెల్లబడే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు పొడిగా మారకుండా, దృఢంగా ఉంచుతుంది. జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. రాత్రి నిద్రకు ముందు తలకు మర్దన చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి. బాదం నూనె,జుట్టును మెరిసేలా చేస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే నూనె కావడంతో జుట్టు మృదువుగా మారుతుంది.తేలికగా జీర్ణమయ్యే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉంటుంది. 2-3 చుక్కల బాదం నూనెను తలకు మర్దన చేయాలి. కస్తూరి మెంతి నూనె,చుండ్రును నివారిస్తుంది.

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. తలలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ నూనెను గోరు వేడి చేసి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. వారానికి 2-3 సార్లు నూనె మర్దన చేయండి. తేలికపాటి హెర్బల్ షాంపూ వాడండి. హీట్ ప్రొడక్ట్స తగ్గించండి. పోషకాహారం తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి కీలకం.ఈ నూనెలను మీ జుట్టు రకానికిని, సమస్యలకిని అనుగుణంగా ఎంచుకుని వాడితే, మీ జుట్టు సహజంగా ఆరోగ్యంగా, మందంగా, మెరుస్తూ ఉంటుంది. చుండ్రును తగ్గించేందుకు సహాయపడుతుంది. గోరు వేడినీటిలో కొబ్బరి నూనెను వేడిచేసి, తలకి మర్దన చేయాలి. జటామాంసి నూనె,జుట్టు తెల్లబడే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: