
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..!
రాత్రంతా శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి, డిటాక్సిఫికేషన్‌లో సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు మూత్ర విసర్జనను పెంచి కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల్లో ఉండే వ్యర్థాలు త్వరగా బయటకు పంపబడతాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసి, రోజూ మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. గోరువెచ్చని నీరు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడం వల్ల చర్మం సహజంగా మెరుస్తూ ఉంటుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. మైగ్రేన్, తలనొప్పి సమస్యలు తగ్గుతాయి.
ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల రక్తంలో వేడి తగ్గి తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.గోరువెచ్చని నీరు శరీర రోగనిరోధక శక్తిని పెంచి, అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో: ఉదయం నిద్రలేగానే 1-2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. లెమన్ లేదా తేనె కలిపి: బరువు తగ్గేందుకు నిమ్మరసం, తేనె కలిపి తాగిత. ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. జీరా లేదా మెంతులు కలిపి: రాత్రంతా నీటిలో నానబెట్టిన జీరా లేదా మెంతులను ఉదయం మరిగించి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది.ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగే అలవాటు చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.