తోటకూర తింటే ఇన్ని బెనిఫిట్సా?.. అయితే తప్పక తినాల్సిందే..!

frame తోటకూర తింటే ఇన్ని బెనిఫిట్సా?.. అయితే తప్పక తినాల్సిందే..!

lakhmi saranya
తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి అందరికీ తెలిసింది. తోటకూరలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తోటకూర నీ డైలీ తినటం మంచిది. తోటకూర ఎక్కువగా తినటం వల్ల మన బాడీలో బ్లడ్ అనేది పడుతుంది. బ్లడ్ లేనివారు తోటకూరని డైలీ తినండి. రోగ నిరోధక శక్తిని నివారించడంలో ఈ తోటకూర సహాయపడుతుంది. పి సి ఓ డి లాంటి సమస్యలు ఉన్నవారు ఈ తోటకూరని డైలీ తినటం మంచిది. తక్షణమే ఉపశ్రమమం కలుగుతుంది. తోటకూరలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బి, సి గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది.
తోటకూరలో అధికంగా ఇనుము ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. డయాబెటిస్ కంట్రోల్. తోటకూరలో తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో, హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. జీర్ణశయ సమస్యల నివారణ. తోటకూరలో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. తోటకూరలో కెల్షియం మరియు మాగ్నీషియం అధికంగా ఉండటంతో ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఉంటుంది.
 కంటి చూపు మెరుగుపరిచే శక్తి. తోటకూరలో విటమిన్ A అధికంగా ఉండటంతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహాయపడుతుంది. ఆంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ముడతలు, పొడిబారడం వంటి సమస్యలు తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తోటకూరలో తక్కువ కాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటంతో గర్భిణీ స్త్రీలకు ఇది చాలా మేలుచేస్తుంది, బిడ్డ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. తోటకూరలో ఉండే అమినో ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి, ముఖ్యంగా మహిళల్లో PCOS లాంటి సమస్యలకు ఉపశమనం కలిగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: