ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే!

lakhmi saranya
ఎర్రచందనంలో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ఎర్ర చందనం కలపతో విలాసమంతమైన ఫర్నిచర్ తయారు చేశారు. ఖరీదైన బొమ్మలు, సంగీత వాయిద్యాలను తయారు చేస్తారు. ఔషధాల తయారీలోనూ ఎర్రచందనాన్ని ఉపయోగిస్తున్నారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయా లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఎర్రచందనం చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. శరీరంలో మంట, అధిక దాహం సమస్యలకు ఎర్రచందనం చెక్ పెడుతుంది. దీర్ఘకాలిక దగ్గు, జలుబు ఎర్రచందనంతో నయం అవుతుంది.
 నిపుణుల సూచన మేరకు ఎర్రచందనం వాడకంతో మధుమేహాన్ని నయం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్ట్రిటిస్ సమస్యకు చికిత్స చేస్తుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కంటి వ్యాధులకు సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ తో పోరాటానికి కూడా సహాయపడుతుంది. ఇది అల్సర్ల నుంచి రక్తస్రావం కాకుండా నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరానికి మంచి కూలింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేయటంలోనూ ఎర్రచందనం సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది పరాన్న జీవి సంక్రమణను నిరోధించగలదు. పాము కాటుకు, తేలు కుట్టిన వారికి లేపనంగా ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, ఎర్ర చందనంలో పలు రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనం కాపర్, యురేనియం, స్ట్రోంటియం, కాడ్మియం, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉన్నందున ఎర్రచందనం అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి గాయాలను నయం చేయడానికి, రక్తం గడ్డ కట్టడానికి, థైరాయిడ్ పనితీరుకు, మీ శరీరం ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, నరాల కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్ట్రిటిస్ సమస్యకు చికిత్స చేస్తుంది.  ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: