నిమ్మ స్కిన్ కి మంచిదే.. నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంతో హానికరమో తెలుసా!

frame నిమ్మ స్కిన్ కి మంచిదే.. నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంతో హానికరమో తెలుసా!

lakhmi saranya
సిట్రస్ పండుల్లో నిమ్మకాయ ఒకటి. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. నిమ్మతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో... అదే విధంగా అందానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే నిమ్మకాయను చర్మానికి అప్లై చేయడం ఒక యోజనకరంగా పరిగణించబడుతుంది. దీన్ని తినటం లేదా స్కిన్ ని అప్లై చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలామంది నిమ్మకాయను నేరుగా ముఖంపై అప్లై చేస్తారు...ఇలా చేయటం ప్రయోజనాలకు బదులుగా చర్మానికి హాని కలిగిస్తుంది. ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా చేసుకోవడానికి సింపుల్ టిప్స్ నుంచి ఖరీదైన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు.
ముఖం, చర్మ సౌందర్య కోసం చికిత్స నుంచి అనేక రకాల టిప్స్ ని ఉపయోగిస్తారు. అయితే చర్మంపై ప్రతి దానిని అప్లై చేసే ముందు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఈరోజు మనం చర్మానికి ఎంతో మేలు చేసే నిమ్మకాయ గురించి తెలుసుకుందాం. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కనుక ఇది చర్మం మీద ఉన్న మచ్చలను తొలగించడానికి శక్తివంతమైన పదార్థం. అయితే దీనిని అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. నిమ్మకాయను ఎప్పుడూ నేరుగా అప్లై చేయడం మంచిది కాదు. ఇలా నేరుగా స్కిన్ నిమ్మకాయను అప్లై చేయడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం. నిమ్మకాయలో విటమిన్లు సమృద్ధిగా ఉండటమే కాదు...
ఇది సహజమైన బ్లీచింగ్ గా పనిచేస్తుంది. అందువల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిలో ఆమ్ల లక్షణాల కారణంగా చర్మంపై నేరుగా అప్లై చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి... ఎందుకు నిమ్మకాయను నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు... నిమ్మకాయను నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీనివల్ల దురద, మంట, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. అందుకే శనగపిండి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె, కలబంద జెల్ వంటి కొన్ని పదార్థాలతో కలుపుకోవాలి. ఇలా నెమ్మని కొన్ని పదార్థాలతో కలిపి రాయడం వల్ల చర్మం అందంగా ఉంటుంది. సెన్సిటిప్ స్కిన్ ఉన్నవారు ముఖ్యంగా చర్మంపై నేరుగా నిమ్మకాయను అప్లై చేయవద్దు. ఇలాంటి చర్మ తత్వం ఉన్న వాళ్ళు నేరుగా నిమ్మకాయని అప్లై చేస్తే చర్మం వాపు, ఎరుపు, దద్దుర్లు ఏర్పడవచ్చు. ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: