చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి... ఎందులోకైనా అదుర్స్..!
మీరు వెరైటీగా వేరే ఐడెమ్ ఏదైనా తినాలి అనుకుంటే చికెన్ సాంబార్ డ్రైవ్ చేయాలి. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి ఈ చికెన్ సాంబార్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చికెన్ సాంబార్ చేయడానికి ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఓ అరగంట పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, గసగసాలు వేసి వేగిన తర్వాత జీడిపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసి ఓ నిమిషం ఫ్రై చేయండి. ఇవన్నీ చల్లారాక...
మిక్స్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి మిక్స్ పట్టాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో వేడి నీళ్లు వేసి... చింతపండు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మ్యారినేట్ చేసి చికెన్ వేసి ఉడికించాలి. ముక్క కాస్త ఉడికిన తర్వాత నీళ్లు, చింతపండు రసం, మసాలా పొడి, కొబ్బరిపాలు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికే అంతవరకు మరిగించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ సాంబార్ సిద్ధం.