బీట్ రూట్ ని ఇలా వాడారంటే.. చర్మం మెరిసిపోవాల్సిందే!

lakhmi saranya
ముఖం లేదా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి అమ్మాయిలు, అబ్బాయిలు మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఎక్కువగా ఫేస్ ప్యాక్ లు, క్రీములు, లోషన్స్ యూజ్ చేస్తుంటారు. మొటిమల నుంచి జుట్టు సంరక్షణ వరకు కేర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా ఖర్చు ఎక్కువ అయ్యే పద్ధతిలో కాకుండా కేవలం బీట్ రూట్ తో అందాన్ని రెట్టింపు చేసుకునే హోం రెమెడీస్ కూడా ఉన్నాయ్ అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు.
బీట్ రూట్ లో చర్మాన్ని, జుట్టును అందంగా మార్చగలిగే పోషకాలు ఉన్నాయని నీ పునులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఉపయోగించడం ద్వారా చర్మంపై మృతకణాలను తొలగించి, కొత్త కణాల పునరుద్దరణకు సహాయపడుతుంది. స్కిన్ గ్లోను పెంచుతుంది. బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి బీట్ రూట్ ఫేస్ ప్యాక్ ఎంతో మేలు చేస్తుంది. చర్మం నికారింపు పెంచడంలో బీట్ రూట్ అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకోసం రోజు రెండు చెంచాల బీట్ రూట్ రసాన్ని అదే పరిమాణంలోని పెరుగుతో కలిపి ఫేస్ కు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే నిగనిగాలాడుతుంది. అట్లనే రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక స్పూన్ పాలు, రెండు మూడు చుక్కల కొబ్బరి లేదా బాదం నూనె వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఆ విష్ణమాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం లో గ్లో పెరుగుతుంది. నారింజ తొక్కలను కూడా ఎండబెట్టి, మెత్తగా నూరి, రెండు చెంచాల ఆరెంజ్ పిల్ పౌడర్, ఒక పొద్దున చెంచా బీట్ రూట్ జ్యూస్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: