పిల్లల్లో ఈ రక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే తస్మాత్ జాగ్రత్త..!

frame పిల్లల్లో ఈ రక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే తస్మాత్ జాగ్రత్త..!

lakhmi saranya
ఈరోజుల్లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తినటానికి మాత్రం అసలు చూడరు. ఇప్పుడు యాక్టివ్ గా ఉండే పిల్లలు డల్ గా మారిపోయారా? చదువుపై ఆసక్తి చూపడం లేదా? ఏకాగ్రత తగ్గిందా? బద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే పేరెంట్స్ ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కాల్షియం లోపం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు ఇంకా ఏవో సింప్టమ్స్ కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. పిల్లలు ఆటలాడడానికి ఆసక్తి చూపడం లేదంటే..
వారిలో కాల్షియం లోపం కూడా ఉండవచ్చు. దీనివల్ల బలహీనత అవహించి అలా చేస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, జలదరింపు, నొప్పి, చర్మంపై తెల్లటి మచ్చలు వంటివి కూడా కాల్షియం లోపం ఉందనడానికి సంకేతాలుగా ఈపునులు చెబుతున్నారు. చలికాలంలో తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. దంతాలు, చిగుళ్లలో నిప్పితో ఇబ్బంది పడుతుంటారు కానీ... కొంతమంది పేరెంట్స్ కు చెప్పారు. ఏదో చిన్న సమస్య అనుకుంటారు. దీనివల్ల తిండి సరిగ్గా తినరు. క్రమంగా ఎముకలు, దంతాలు బలహీన పడే అవకాశం ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపం వల్లే ఇలా జరుగుతుంది.
అలాగే నోటి పరిశుభ్రత పాటించకుంటే కూడా పిరియంటల్ డిసిస్ అనే చిగుళ్ల యాది రావచ్చు. సహజంగానే ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఎదురు చూస్తుంటారు పిల్లలు. కానీ అర్ధరాత్రులు కూడా వారు మేల్కొంటున్నారంటే అనుమానించాల్సిందే. కాల్షియం లోపం వల్ల కూడా ఎలా జరుగుతుంది. దీంతో నీరసంగా, బలహీనంగా మారుతారు. బద్ధకం, అలసట వేధిస్తాయి. నిద్రలేమిని ఎదుర్కొంటుంటారు. చేతులు, చేతి గోళ్ళ ఏల్లో కలర్ లో మారిపోతే అది కాల్షియం లోపం లక్షణాలేనని నిపుణులు అంటున్నారు. దీంతో పిల్లల గోళ్ళు బలహీనంగా మారడం, పాలిపోవడం, ముక్కాలుగా విరుగుతూ రాలిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, దురద వంటివి కూడా పిల్లల్లో కాల్షియం లోపం వల్ల తలెత్తే సమస్యలుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: