అమ్మమ్మ చెప్పిన చిట్కా... అద్భుతంగా పనిచేస్తుంది...!

lakhmi saranya
ఆడవారు తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తాము అందంగా కనిపించడానికి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. అందాన్ని మెరుగుపరచడం కోసం మహిళలు మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా రసాయనాలు కలిపిన వాటిని కాకుండా అమ్మమ్మల కాలం నుండి చార్మా సౌందర్యానికి ఉపయోగిస్తున్న సున్ని పిండిని వంటికి పట్టించి రుద్దితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో చర్మాన్ని మెరిపించే పోషకాలు చాలా ఉంటాయి.

సున్నిపిండి తయారీలో ఉపయోగించే శనగపిండి, పెసర పిండి, పసుపు చర్మాన్ని సంరక్షిస్తాయి. సున్ని పిండిలో వాడే గులాబీ రేకులు ట్యాన్ ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇది చర్మాన్ని జుడ్డుగా మారకుండా కాపాడతాయి. సున్ని పిండిలో కలిపే పసుపు యాంటీ ఫంగల్ , యాంటీబ్యాక్టీరియల్ గా పని చేస్తాయి. మచ్చలు లేకుండా చేసి, చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. సున్ని పిండిలో కాస్త నువ్వుల నూనెను వేసి ఒంటికి పట్టిస్తే, హేమానికి రక్తప్రసరణ జరుగుతుంది. ప్రతిరోజు ఉపయోగించే సబ్బు పైపై ఉండే జిడ్డును మాత్రమే తొలగిస్తుంది. సున్నిపిండి అయితే చర్మ రంధ్రాల లోపల ఉన్న మురికిని తొలగిస్తుంది. అంతేకాకుండా రోజంతా శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.

 ప్రతిరోజు సున్నిపిండితో స్నానం చేయటం వల్ల చర్మవ్యాధులు దరిచేరవు. మొటిమలు, ముడతలు తగ్గి, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఉలవలు, ముల్తానీ మట్టిని సమానంగా కావాల్సిన మోతాదులో తీసుకోవాలి. పసుపు, గులాబీ రేకులు, తులసి ఆకులు,నారింజ తొక్కలు, బియ్యప్పిండి, మెంతులను గ్రాముల్లో తీసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఉలవలు, ముల్తాని మట్టిని పావు కేజీ తీసుకున్నట్లయితే... పసుపు, గులాబీ రేకులు, తులసి ఆకులు, నారింజ తొక్కలు, బియ్యం పిండి, మెంతులను 60 గ్రాముల వరకు తీసుకోవాలి. ముందుగా పైన తెలిపిన పదార్థాలు అన్నిటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఆ తరువాత మొత్తాన్ని పిండిలా చేసి, అన్నిటినీ బాగా కలుపుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: