సొంతంగా మందులు వాడేస్తున్నారా..? అయితే, ప్రమాదమే...!
అయితే, ఇలా చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించకుండా మందులు వాడితే, శరీరంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సొంతం వైద్యం చేయటం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొందరు వైద్యుల సభకు వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి, సొంతంగా మందులు తీసుకుని వాడుతుంటారు. అయితే, దీనివల్ల శరీరంలో యాంటి బయోటిక్ నిరోధం, మందులకు బాగా అలవాటు పడుతుంది. దీనివల్ల ప్రతిసారి చిన్న చిన్న వాటికే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. వయస్సు, జబ్బు లక్షణాల ఆధారంగా మోతాదుల్లో మార్పులు ఉంటాయి.
కొందరు అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్ ను తరచుగా వాడుతుంటారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో ఇన్ ఫెక్షన్ తీవ్రత మరింత పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకవేళ వైద్యులను సంప్రదించకుండా టాబ్లెట్స్ వాడితే, కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు తీసుకునే టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయా లేదా అనేది తెలుసుకోవాలి. మందులపై ఉన్న అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి. టాబ్లెట్ వేసేకునేటప్పుడు సరైన డోస్ తీసుకోవడం మంచిది. వీటిని కొనే ముందు ఒక్కసారి మెడికల్ షాప్ లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ఉపయోగించాలి.