మహిళలు ఇలా జుట్టు ముడి వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

praveen
ఇప్పుడంటే జుట్టు విరబోసుకోవడం, వి కట్ అని, యూ కట్ అని, ఫెథర్ కట్ అంటూ రకరకాలుగా జుట్టుని కత్తిరించుకుని వదులుగా వదిలేయడం ఫ్యాషన్ అయిపొయింది. కానీ రెండు తరాల ముందు వరకూ అమ్మాయిలకు జడ వేసుకోవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే, మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఆడవారు జడ వేసుకోవడం అనేది పరంపరగా వస్తోంది మరి. చిన్న పిల్లలు 2 జడలు వేసుకుంటే, యువత ఒక జడ, ఇక స్త్రీలు అమ్మలుగా మారాక సైగ ముడి వేసుకోవడం సర్వసాధారణం. ఇక ఒకప్పటి అమ్మాయిలు అయితే, జడ వేసుకుని.. వాటికీ ప్రత్యేకమైన భరణాలను జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు మొదలైనవి అలంకరించుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం అయిపోయింది.. అది వేరే విషయం!
ఇక అసలు విషయంలోకి వెళితే, మహిళలు జడ వేసుకుంటే చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని రకాల జడలు వేసుకోకపోవడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు కొంతమంది సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది.. పోనీ టైల్. పోనీ టైల్ వంటి జడని వేసుకున్నప్పుడు చాలావరకు అమ్మాయిలు చాలా బిగుతుగా జడను ముడివేసుకోవడం జరుగుతుంది. కానీ అది ఎంతమాత్రమూ మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అలా వెంట్రుకలను గట్టిగా ముడి వేసినపుడు ఆ ప్రభావం నుదిటి నరాలమీద పడి మైగ్రేన్ వంటి తలనొప్పులకు దారితీస్తుందని అంటున్నారు.
ఇక అప్పట్లో స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరిగితే దరిద్రమని.. జేష్టాదేవికి చిహ్నమని భావించేవారు. అందుకే దాదాపుగా అప్పటి స్త్రీలు అందరూ జడలు వేసుకునేవారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. అయితే ఇది కాలక్రమేణా మారుతూ వస్తోంది. ఇప్పుడు సంప్రదాయాలకంటే అధునూతన వెసులుబాట్లకే యువత ఎక్కువ మొగ్గు చూపుతుంది. అయితే జుట్టుని జడగా వేసుకోవడం ఉత్తమమైనదేనని, అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జుట్టుని ముడి వేసుకుంటే ఉత్తమం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: