రోజు అంబానీ తినే ఆహారం ఏంటో తెలుసా..?

Divya
రిలయన్స్ జియో ఇండస్ట్రీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించారు. మన దేశంలోని బిజినెస్ ప్రపంచాన్ని సైతం సాసిస్తున్న ముఖేష్ అంబానీ వ్యాపార రంగంలో కూడా తన మార్కుని చూపిస్తున్నారు. అయితే వీరి యొక్క జీవనశైలి ఆహారపు అలవాట్లతో కూడా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చేలా చేస్తున్నారు అంబానీ కుటుంబం. ముఖేష్ అంబానీ భార్య ,రిలయన్స్ అధినేత  ముఖేష్ అంబానీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సైతం మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.

ఇందులో ముఖ్యంగా వారి యొక్క డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది వారి యొక్క జీవన శైలి ఏంటి ఆహారపు అలవాట్ల గురించి తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు నిద్ర లేచి తన దినచర్యలను పూర్తి చేసుకుంటారట.. అల్పాహారంలో భాగంగా తాజా పండ్లు జ్యూస్ తో.. ఇడ్లీ సాంబార్ ను అల్పాహారంగా తింటారట. ఇలా తినడం వల్ల వీరు రోజంతా అలసిపోకోకుండా శక్తితో ఉండవచ్చని నమ్ముతూ ఉంటారట.అంబానీ క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే ఆల్కహాల్, జంక్ ఫుడ్ వంటి వాటినీ అసలు ముట్టరట అయితే వారానికి ఒకసారి మాత్రమే బయట ఫుడ్  తింటారని మిగిలిన రోజుల్లో ఇంట్లోనే చాలా ప్రత్యేకంగా భోజనం చేయించుకొని మరి తింటారట.

ముఖేష్ అంబానీ భోజనంలో అన్నం పప్పుతో పాటు పలు రకాల కూరగాయలు ఉండాల్సిందేనట. సలాడ్లు, చూపులతో పాటు రెడ్ మీట్, మసాలా వంటి వాటిని అసలు దరి చేరనివ్వరట. అబ్బాయి తీసుకునే ఆహారం శరీరానికి మాత్రమే కాదు మానసికంగా కూడా ఆనందాన్ని ఉల్లాసంగా ఉంచేలా చేస్తుందట. అందుకే ఎక్కువగా తన మొక్కల ఆహారాన్ని ఎంచుకుంటారట. అలాగే ప్రతిరోజు వాకింగ్ చేయడం మానసిక ఉత్సాహంగా అందిస్తుందట. అలాగే ధ్యానం, యోగ వంటి వాటిని కూడా చేస్తూ ఉంటారట. ఇలాంటి కఠినమైన వర్కవులు చేయకుండా తన బరువులో 15 కిలోలు తగ్గారట. మసాలా ఫుడ్ కు మాత్రం ఎలాంటి అవకాశాన్ని ఇవ్వరట అంబానీ కుటుంబం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: